ఆఫ్ఘాన్ బౌలర్లను ఊచకోత కోసిన సూర్యకుమార్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకుంది!

ఆఫ్ఘానిస్థాన్​తో సూపర్-8 మ్యాచ్​లో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లపై తుఫానులా విరుచుకుపడ్డాడు. ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్​కు దిగాడు.

ఆఫ్ఘానిస్థాన్​తో సూపర్-8 మ్యాచ్​లో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లపై తుఫానులా విరుచుకుపడ్డాడు. ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్​కు దిగాడు.

టీ20 వరల్డ్ కప్-2024లో మరోమారు సత్తా చాటాడు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. ఆఫ్ఘానిస్థాన్​తో జరుగుతున్న సూపర్-8 పోరులో తన విశ్వరూపం చూపించాడు. ఫస్ట్ బాల్ నుంచే అతడు హిట్టింగ్​కు దిగాడు. 90 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి అడుగుపెట్టిన సూర్య.. డిఫెన్స్​కు వెళ్లకుండా మొదటి బంతి నుంచే బాదుడు మొదలుపెట్టాడు. స్పిన్, పేస్ అనే తేడాల్లేకుండా ఎవరు బౌలింగ్​కు వచ్చినా ఉతికిఆరేశాడు. ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా అండతో చెలరేగిపోయాడు.

ఆఫ్ఘాన్​తో మ్యాచ్​లో 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్​ను చేరుకున్నాడు సూర్య. మొత్తంగా 53 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇందులో 5 బౌండరీలతో పాటు 3 భారీ సిక్సులు కూడా ఉన్నాయి. స్లో పిచ్​పై బ్యాట్ మీదకు లేట్​గా వస్తున్న డెలివరీస్​ను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే సూర్య మాత్రం ఆఖరి మూమెంట్ వరకు వెయిట్ చేసి బంతుల్ని గ్యాప్స్​లోకి పంపించి సరైన ఫలితాలు రాబట్టాడు. వికెట్ ఇవ్వకుండా పట్టుదలతో క్రీజులో పాతుకుపోయాడు. హార్దిక్​తో కలసి ఐదో వికెట్​కు 60 పరుగులు జోడించాడు. సూర్య ఇప్పటికి ఎన్నో స్పెషల్ ఇన్నింగ్స్​లు ఆడాడు. కానీ అతడి కెరీర్​లో మాత్రం ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పొచ్చు. ప్రెజర్ సిచ్యువేషన్​లో డిఫరెంట్ షాట్స్​తో అతడు ఆడిన విధానం భారత ఇన్నింగ్స్​లో హైలైట్​ అనే చెప్పాలి. మరి.. సూర్య ఇన్నింగ్స్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments