టీమిండియా చెత్త రికార్డు.. 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి!

India vs Sri Lanka: టీమిండియా చెత్త రికార్డును నెలకొల్పింది. ఇలా జరగడం 27 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఇది భారత అభిమానులకు మింగుడు పడనిదిగా చెప్పొచ్చు.

India vs Sri Lanka: టీమిండియా చెత్త రికార్డును నెలకొల్పింది. ఇలా జరగడం 27 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఇది భారత అభిమానులకు మింగుడు పడనిదిగా చెప్పొచ్చు.

టీమిండియా చెత్త రికార్డును నెలకొల్పింది. ఇలా జరగడం 27 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఇది భారత అభిమానులకు మింగుడు పడనిదిగా చెప్పొచ్చు. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో రోహిత్ సేన 110 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఈ సిరీస్​ను 0-2 తేడాతో కోల్పోయింది. లంక చేతిలో మెన్ ఇన్ బ్లూ సిరీస్ ఓడటం 27 ఏళ్ల తర్వాత ఇదే ఫస్ట్ టైమ్ కావడం గమనార్హం. ఆ విధంగా చెత్త రికార్డును మూటగట్టుకుంది మన టీమ్. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన ఆతిథ్య జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు చేసింది.

లంక బ్యాటర్లలో నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుశాల్ మెండిస్ (59) సూపర్బ్​గా ఆడారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3 వికెట్లతో డెబ్యూ మ్యాచ్​లోనే తన మార్క్ చూపించాడు. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన టీమిండియా 26.1 ఓవర్లలో 138 పరుగులకే చాపచుట్టేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (35) టాప్ స్కోరర్​గా నిలిచాడు. బ్యాటర్లంతా విఫలమవడంతో జట్టుకు భారీ ఓటమి తప్పలేదు. విరాట్ కోహ్లీ (20) మంచి స్టార్ట్ దొరికినా యూజ్ చేసుకోలేకపోయాడు. వాషింగ్టన్ సుందర్ (30) పోరాడినా అప్పటికే మ్యాచ్ మన చేతుల్లో నుంచి జారిపోయింది.

Show comments