టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను నేనే ఎత్తుతా! రింకూ కాన్ఫిడెన్స్‌కు కారణం అదేనా?

T20 World Cup 2024, Rinku Singh: టీమిండియా యువ క్రికెటర్‌ రింకూ సింగ్‌ భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. మరి కొన్ని రోజుల్లో టీ20 వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. వరల్డ్‌ కప్‌ నేనే ఎత్తుతా అన్నాడు. మరి అతని కాన్ఫిడెన్స్‌కి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

T20 World Cup 2024, Rinku Singh: టీమిండియా యువ క్రికెటర్‌ రింకూ సింగ్‌ భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. మరి కొన్ని రోజుల్లో టీ20 వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. వరల్డ్‌ కప్‌ నేనే ఎత్తుతా అన్నాడు. మరి అతని కాన్ఫిడెన్స్‌కి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ను తానే ఎత్తుతానంటూ టీమిండియా యువ క్రికెటర్‌ రింకూ సింగ్‌ చాలా పెద్ద స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2024లో ఛాంపియన్స్‌గా నిలిచిన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ జట్టులో రింకూ సింగ్‌ సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. తన టీమ్‌ ఐపీఎల్‌ కప్పు కొట్టడంతో మస్తు హ్యాపీగా ఉన్న రింకూ.. అదే సంతోషంలో టీ20 వరల్డ్‌ కప్‌ కూడా తానే ఎత్తుతానంటూ పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో రింకూ సింగ్‌ పెద్దగా ప్రభావం చూపలేదు. చాలా మ్యాచ్‌ల్లో అతనికి బ్యాటింగ్‌ రాలేదు. కానీ, గతేడాది రింకూ బ్యాటింగ్‌ చేసి క్రికెట్‌ లోకం నివ్వెరపోయింది. చివరి ఐదు బంతుల్లో ఐదు సిక్సులు కూడా కొట్టి మ్యాచ్‌ గెలిపించిన దాఖలాలు ఉన్నాయి. అంతటి విధ్వంసం సృష్టించాడు.

ఐపీఎల్‌తో పాటు డొమెస్టిక్‌ క్రికెట్‌లో రింకూ సింగ్‌ చూపించిన ప్రతిభ ఆధారంగా అతనికి టీమిండియా తరఫున ఆడే అవకాశం లభించింది. టీమిండియా తరఫున ఇప్పటి వరకు 15 టీ20 మ్యాచ్‌లు, 2 వన్డేలు ఆడాడు రింకూ సింగ్‌. టీ20ల్లో రింకూ ప్రదర్శన బాగుంది. ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమ్‌లో రింకూకు చోడు దక్కుతుందని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా రింకూ సింగ్‌ను పక్కనపెట్టారు సెలెక్టర్లు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం ప్రకటించిన 15 మందితో కూడిన స్క్వౌడ్‌లో కాకుండా.. ట్రావెలింగ్‌ స్టాండ్‌బై ఎంపిక చేసిన నలుగురిలో ఒకడిగా రింకూ సింగ్‌కు చోటు దక్కింది. రింకూకు టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కకపోవడంపై భారత క్రికెట్‌ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

రింకూ సింగ్‌కు అన్యాయం జరిగిందంటూ సోషల్‌ మీడియాలో క్రికెట్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఈ విషయంపై రింకూ సింగ్‌ కూడా బాధపడినట్లు తెలిసింది. టీ20 వరల్డ్‌ కప్‌ జట్టులో చోటు దక్కనందుకు రింకూ బాధపడుతున్న సమయంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. రింకూతో మాట్లాడి అతన్ని నార్మల్‌ చేశాడు. అయితే.. ట్రావెలింగ్‌ స్టాండ్‌బైగా ఉండటంతో.. రింకూ కూడా టీమిండియాతోనే ఉండనున్నాడు. ఐపీఎల్‌ కప్పు ఎత్తినట్లే.. టీ20 వరల్డ్‌ కప్‌ ఎత్తుతానని, ఇదంతా గాడ్స్‌ ప్లాన్‌ అంటూ వెల్లడించాడు. టీమిండియాపై తనకున్న నమ్మకంతోనే అతను ఈ భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చి ఉంటాడని క్రికెట్‌ ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. మరి టీ20 వరల్డ్‌ కప్‌ ఎత్తుతానని రింకూ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments