టీమిండియా తరఫున టెస్ట్‌ క్రికెట్‌ ఆడాలని ఉంది! ఎందుకంటే..: రింకూ

Rinku Singh, Test Cricket, Team India: వన్డేలు, టీ20లు, టీ10లు ఎన్ని వచ్చినా.. టెస్టు క్రికెట్‌లో ఉండే మజానే వేరు. అందుకే రింకూ సింగ్‌ కూడా టెస్టులు ఆడాలని అనుకుంటున్నాడు. అయితే దానికి అతనో బలమైన కారణం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Rinku Singh, Test Cricket, Team India: వన్డేలు, టీ20లు, టీ10లు ఎన్ని వచ్చినా.. టెస్టు క్రికెట్‌లో ఉండే మజానే వేరు. అందుకే రింకూ సింగ్‌ కూడా టెస్టులు ఆడాలని అనుకుంటున్నాడు. అయితే దానికి అతనో బలమైన కారణం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా యువ క్రికెటర్‌ రింకూ సింగ్‌ తన మనసులో మాటను బయటపెట్టేశాడు. టీమిండియా తరఫున ఇప్పటికే టీ20, వన్డేల్లో అరంగేట్రం చేసిన ఈ పాకెట్‌ డైనమైట్‌. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 15 టీ20లు, 2 వన్డేలు ఆడిన రింకూ.. ఇక టెస్టులు ఆడటమే తన లక్ష్యం అని అన్నాడు. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాలని అనుకుంటున్నట్లు రింకూ వెల్లడించారు. రింకూ సింగ్‌ మాట్లాడుతూ.. ‘నేను అన్ని ఫార్మాట్లలో ఆడాలనుకుంటున్నాను. ఇటీవల నేను దక్షిణాఫ్రికాలో వన్డేలు ఆడాను. అందుకోసం నేను ఎంతో కష్టపడుతున్నాను. నాకు వీలైనంత త్వరగా టీమిండియా తరఫున టెస్టులు ఆడే అవకాశం రావాలని ప్రార్థించండి. టెస్ చాలా స్పెషల్‌ అని, టీ20 క్రికెట్‌ ఎవరైనా ఆడతారు. కానీ, అందరికీ టెస్టులు ఆడే అవకాశం రాదు. టీమిండియా తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటమే నా లక్ష్యం’ అని రింకూ పేర్కొన్నాడు.

ఐపీఎల్‌ 2023లో రింకూ సింగ్‌ చూపించిన అద్భుతమైన ప్రతిభతో అతనికి టీమిండియాలో చోటు దక్కింది. ఇండియన్‌ టీ20 క్రికెట్‌ టీమ్‌లో కూడా రింకూ సింగ్‌ మంచి ప్రదర్శన కనబర్చాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్‌ 2024 సీజన్‌లో రింకూ సింగ్‌కు పెద్దగా ఆడే అవకాశం రాలేదు. కేకేఆర్‌ టాపార్డర్‌ బ్యాటర్లు అద్భుతంగా రాణించడంతో మ్యాచ్‌లు ముగించాల్సిన పని కూడా రింకూకు లేకుండా పోయింది. అయితే.. రింకూ సింగ్‌ టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం ఎంపిక అవుతాడని అంతా బలంగా నమ్మారు. కానీ, భారత సెలెక్టర్లు రింకూ సింగ్‌ను పట్టించుకోలేదు. 15 మందితో కూడిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024 స్క్వౌడ్‌లో కాకుండా.. ట్రావెలింగ్‌ స్టాండ్‌బై ఎంపికైన నలుగురిలో రింకూకు చోటు దక్కింది.

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో చోటు దక్కనందుకు రింకూ సింగ్‌ చాలా బాధపడ్డాడు. కానీ, ఆ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్‌ చేయలేదు. భవిష్యత్తులో అవకాశాలు వస్తాయనే ధీమాతో ఉన్నాడు రింకూ సింగ్‌. అయితే.. టీమిండియాలో ఫినిషర్‌గా రింకూకు మంచి ప్లేస్‌ ఉన్నా.. హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా రూపంలో ఆల్‌రౌండర్‌ కమ్‌ ఫినిషర్లు ఉండటంతో ఈ సారి రింకూ సింగ్‌కు మొండి చేయి తప్పలేదు. టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కకపోయినా.. కనీసం తనకు టెస్టులు ఆడే అవకావం అయినా కల్పించాలని రింకూ కోరుకుంటున్నాడు. టీ20లు అందరు ఆడతారని, టెస్టులు కొందరే ఆడగలరని రింకూ నమ్ముతున్నాడు. అందుకే తనను తాను టెస్టుల్లో నిరూపించుకోవాలని రింకూ ఫిక్స్‌ అయి ఉన్నాడు. మరి టెస్టులు ఆడాలని ఉందని తన మనసులో మాట పెట్టిన రింకూ సింగ్‌.. తన కోరికను తీర్చుకుంటాడని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments