పాకిస్థాన్‌పై పరుగుల వదరపారించిన ఇంగ్లండ్‌! బ్రూక్‌ ట్రిపుల్‌, రూట్‌ డబుల్‌ సెంచరీలు

Harry Brook, ENG vs PAK, Virender Sehwag, Multan: ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌ హ్యారీ బ్రూక్‌ ట్రిపుల్‌ సెంచరీతో సత్తా చాటాడు. అది కూడా పాకిస్థాన్‌పై.. ఆ ఇన్నింగ్స్‌ గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Harry Brook, ENG vs PAK, Virender Sehwag, Multan: ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌ హ్యారీ బ్రూక్‌ ట్రిపుల్‌ సెంచరీతో సత్తా చాటాడు. అది కూడా పాకిస్థాన్‌పై.. ఆ ఇన్నింగ్స్‌ గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

విధ్వంసం.. మహా విధ్వంసం.. పాకిస్థాన్‌పై పరుగుల వరద పారించింది ఇంగ్లండ్‌. పాక్‌లోని ముల్తాన్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాక్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ.. ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్లు జో రూట్‌, హ్యారీ బ్రూక్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు. అప్పుడెప్పుడో.. 2004లో అంటే.. 20 ఏళ్ల క్రితం ఇదే ముల్తాన్‌ స్టేడియంలో పాకిస్థాన్‌ను చీల్చి చెండాడుతూ.. ఏకంగా 309 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో ఇండియా ఇన్నింగ్స్‌ 52 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడు సెహ్వాగ్‌ రికార్డును బ్రేక్‌ చేస్తూ.. ఇంగ్లండ్‌ యంగ్‌ క్రికెటర్‌ హ్యారీ బ్రూక్‌ 317 పరుగులతో సరికొత్త రికార్డు క్రియేట్‌ చేశాడు. బ్రూక్‌ చెలరేగుతుంటే.. పాక్‌ బౌలర్లు ఏ మాత్రం నిలువరించలేకపోయారు.

పైగా బ్రూక్‌ కేవలం 322 బంతుల్లోనే 317 పరుగులు సాధించాడు. అందులో ఏకంగా 29 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. బ్రూక్‌ ఆడుతుంటే.. బాల్‌ ఎక్కడ వేయాలో కూడా పాపం పాక్‌ బౌలర్లకు అర్థం కాలేదు. అంత అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. బ్రూక్‌. అంతకంటే ముందు.. జో రూట్‌ కూడా విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. 375 బంతుల్లో 17 ఫోర్లతో 262 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. ఈ ఇద్దరు బ్యాటర్లు.. పారించిన పరుగుల వరదకు ఇంగ్లండ్‌ ఏకంగా 823 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది. మొత్తంగా 7 వికెట్ల నష్టానికి 823 చేసి.. తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. రూట్‌ డబుల్‌ సెంచరీ, బ్రూక్‌ ట్రిపుల్‌ సెంచరీతో చెలరేగగా.. జాక్‌ క్రాలే 78, డకెట్‌ 84 పరుగులు చేసి రాణించారు.

అంతకంటే ముందు తొలి ఇన్నింగ్స్‌ ఆడిన పాకిస్థాన్‌ కూడా మంచి స్కోరే చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ షఫీఖ్‌ 102, కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ 151, అఘా సల్మాన్‌ 104, సౌద్‌ షకీల్‌ 82 పరుగులతో రాణించారు. బాబర్‌ ఆజమ్‌ మాత్రం కేవలం 30 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు. ప్రస్తుతం ఆట నాలుగో రోజు మూడో సెషన్‌లో పాకిస్థాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తూ.. కేవలం 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీలతో చెలరేగిన షఫీఖ్‌, షాన్‌ మసూద్‌ రెండో ఇన్నింగ్స్‌లో నిరాశపర్చారు. ఇక బాబర్‌ ఆజమ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగులు మాత్రమే చేసి.. దారుణంగా విఫలం అయ్యాడు. పాక్‌ ఇంకా 220 పరుగులు వెనుకబడి ఉంది. మరి ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్‌, జో రూట్‌ బ్యాటింగ్‌ విధ్వంసంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments