మరికొన్ని రోజుల్లో క్రికెట్ జాతర ప్రారంభం కాబోతోంది. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా ప్రారంభం కానున్న వరల్డ్ కప్ కోసం అన్ని జట్లు సిద్దమవుతున్నాయి. ఇక ఈ మెగా టోర్నీలో ఏఏ జట్లు సెమీస్ కు వెళ్తాయి, ఏ జట్లు ఫైనల్ కు వెళ్తాయి అన్న విషయంపై పలువురు మాజీ క్రికెటర్లు ఇప్పటికే తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇటీవల ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాటర్, మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ సైతం తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వరల్డ్ కప్ లో భారత్, పాక్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టీమ్స్ సెమీ ఫైనల్స్ కు వస్తాయని అంచనా వేశాడు. తాజాగా టీమిండియా టర్బోనేటర్, మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ సైతం ప్రపంచ కప్ లో సెమీ ఫైనల్స్ కు వచ్చే జట్లను పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ పరువు తీస్తూ.. అదొక యావరేజ్ జట్టు అంటూ చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పరువు తీశాడు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఈ వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ కు వచ్చే జట్లు ఏవో చెప్పే క్రమంలో పాక్ టీమ్ పై సెటైర్లు వేశాడు భజ్జీ. ఈసారి ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ కు పాక్ టీమ్ రాదని చెప్పుకొచ్చాడు. దానికి కారణాలు సైతం వెల్లడించాడు ఈ స్టార్ స్పిన్నర్. తన యూట్యూబ్ ఛానల్లో ఈ విషయంపై మాట్లాడుతూ..”ఈసారి వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లాండ్ తో పాటుగా పాక్ టీమ్ ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ నా అంచనా ప్రకారం వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ చేరే నాలుగో జట్టు న్యూజిలాండ్. ఎందుకంటే? పాక్ టీ20ల్లో బాగా ఆడుతోంది. కానీ వన్డేల్లోకి వచ్చే సరికి ఆ టీమ్ ఒక యావరేజ్ టీమ్” పాక్ జట్టు పరువు తీశాడు భజ్జీ.
ఇక ప్రపంచ కప్ కు ముందు భారత-ఆస్ట్రేలియా మధ్య జరిగే వన్డే సిరీస్ పోటాపోటీగా ఉంటుందని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ స్టార్ స్పిన్నర్ పేర్కొన్న సెమీ ఫైనల్ జట్ల లిస్ట్ టో ప్రస్తుతం వన్డేల్లో నంబర్ వన్ జట్టుగా ఉన్న పాక్ ను చేర్చకపోవడం గమనార్హం. కాగా.. 10 జట్లు పోటీ పడుతున్న ఈ వరల్డ్ కప్ లో లీగ్ దశలో ప్రతీ జట్టు మిగిలిన తొమ్మిది టీమ్స్ తో ఒక్కొ మ్యాచ్ ఆడుతుంది. ఇండియా తన తొలి మ్యాచ్ లో అక్టోబర్ 8న ఆసీస్ తో తలపడబోతోంది. మరి పాక్ జట్టుపై భజ్జీ వేసిన సెటైర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
No 🇵🇰 in Harbhajan’s semi-finalists for #ICCWorldCup2023 😯
Do you agree that Pakistan are just an average side in the 50-over format❓😂#ICCWorldCup2023 #HarbhajanSingh pic.twitter.com/ILHD29NibT
— World Cup 2023 #WorldCup2023 (@mrcricket_360) September 20, 2023