భారత క్రికెట్ లో తీవ్ర విషాదం.. మాజీ క్రికెటర్ కన్నుమూత!

భారత క్రికెట్ లో తీవ్ర విషాదం నెలకొంది. సుదీర్ఘ కాలం క్యాన్సర్ తో పోరాడుతూ.. మాజీ క్రికెటర్, కోచ్ బుధవారం కన్నుమూశారు. భారత క్రికెట్ కు ఆయన అందించిన సేవలు ఎనలేనివి.

భారత క్రికెట్ లో తీవ్ర విషాదం నెలకొంది. సుదీర్ఘ కాలం క్యాన్సర్ తో పోరాడుతూ.. మాజీ క్రికెటర్, కోచ్ బుధవారం కన్నుమూశారు. భారత క్రికెట్ కు ఆయన అందించిన సేవలు ఎనలేనివి.

భారత క్రికెట్ లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న మాజీ క్రికెటర్, కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ బుధవారం కన్నుమూశారు. 71 ఏళ్ల వయసులో క్యాన్సర్ తో సుదీర్ఘ పోరాటం చేసి ఓడిపోయారు. గత నెలరోజులుగా లండన్ లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ లో బ్లడ్ క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. అన్షుమన్ చికిత్స కోసం బీసీసీఐ ఇటీవలే రూ. కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ వార్తతో ఇండియన్ క్రికెట్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.

టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ క్యాన్సర్ తో పోరాడుతూ బుధవారం కన్నుమూశాడు. బ్లడ్ క్యాన్సర్ తో లండన్ లోని కింగ్స్ కాలేజీ హాస్పిటల్ లో గత నెల రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆయన తాజాగా తుదిశ్వాస విడిచారు. చికిత్స కు డబ్బుల్లేకపోవడంతో.. బీసీసీఐ రూ. కోటి రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించింది. ఇక అన్షుమాన్ కెరీర్ విషయానికి వస్తే.. టీమిండియా తరఫున 40 టెస్టు, 15 వన్డేలు ఆడాడు. 205 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు కూడా ఆడాడు. అలాగే కోచ్ గా కూడా కొంత కాలం పనిచేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2000లో రన్నరప్ గా నిలిచిన టీమిండియా జట్టుకు కోచ్ గా వ్యవహరించాడు. 1998లో షార్జా టోర్నమెంట్, 1999లో ఫిరోజ్‌షా కోట్లాలో జరిగిన చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ వంటి చిరస్మరణీయ విజయాల్లో కోచ్‌గా గైక్వాడ్ కీలకపాత్ర పోషించాడు. ఇక అన్షుమాన్ మరణవార్త తెలిసిన కొందరు ప్రముఖులు వారి కుటుంబానికి ప్రగాఢా సంతాపాన్ని తెలియజేస్తున్నారు. భారత క్రికెట్ కు ఆయన అందించిన సేవలను కొనియాడుతున్నారు.

Show comments