David Warner: వార్నర్‌ ఎమోషనల్‌ పోస్ట్‌! తనను మించిన రోల్‌ మోడల్‌ లేరంటూ..

అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత.. ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు. తన జీవితంతో పాటు, క్రికెట్‌ కెరీర్‌కు మద్దతుగా నిలిచిన వ్యక్తి గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ పోస్ట్‌లో వార్నర్‌ ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం..

అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత.. ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు. తన జీవితంతో పాటు, క్రికెట్‌ కెరీర్‌కు మద్దతుగా నిలిచిన వ్యక్తి గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ పోస్ట్‌లో వార్నర్‌ ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం..

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఇటీవల తన టెస్ట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు. పాకిస్థాన్‌తో సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌తో వార్నర్‌ తన కెరీర్‌లో చివరి టెస్ట్‌ ఆడేశాడు. టెస్ట్‌ క్రికెట్‌కు తన అగ్రెసివ్‌ బ్యాటింగ్‌తో మెరుపులు అద్దిన వార్నర్‌ రిటైర్మెంట్‌ ప్రతి క్రికెట్‌ అభిమానికి బాధ కలిగించింది. అయితే.. వార్నర్‌ వన్డేలు, టీ20ల్లో కొనసాగనుండటంపై అతని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక చివరి టెస్ట్‌ ఆడేసిన తర్వాత.. వార్నర్‌ ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు. తన కెరీర్‌కు ఎంతో మద్దుతుగా నిలిచిన వ్యక్తి గురించి చాలా ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు. ఇంత సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌ను కొనసాగించడంలో తన భార్య క్యాండిస్‌ వార్నర్‌ ఎలాంటి తోడ్పాటును అందించిందో చెబుతూ.. వార్నర్‌ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు.

ఈ సందర్భంగా వార్నర్‌ ఏం చెప్పాడంటే.. ‘ఇది చాలా భావోద్వేగంతో రాస్తున్నా.. ఏం చెప్పాలి నీ గురించి.. నీ వల్లే ఇంత దూరం రాగలిగాను. ఇది నీకు చాలా సార్లు చెప్పాను. ఉదయం 4 గంటలకు నిద్ర లేపుతావు. నిజానికి క్రికెటర్లు ఇలా చేయాల్సిన అవసరం లేదు. కానీ, దాని వల్లే నాకు డిసిప్లేన్‌ అలవాటు అయింది. అంతకు ముందు దాని అర్థం కూడా నాకు తెలియదు. తెల్లవారుజామున ఆ టైమ్‌లో ఎలాంటి ట్రైనింగ్‌ తీసుకోను, ఆడను కూడా కానీ, అలా ఉదయం లేవడం వల్ల నా మైండ్‌సెట్‌ మారింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలనన్న నమ్మకం కలిగింది. నువ్వు నా జీవితంలోకి వచ్చి, నేను ఏం చేయడాన్ని ఇష్టపడతానో దాన్ని చేయడానికి ఎంతో సపోర్ట్‌ ఇచ్చావ్‌.. దానికి కేవలం థ్యాంక్స్‌ చెప్పలేను. నువ్వు ఎన్నో సవాళ్లను గ్రేస్‌, డెటిర్మినేషన్‌తో ఎదర్కొన్నావ్‌, నిజమైన ధైర్యం​ ఏంటో నాకు నువ్వే చూయించావ్‌. తిరుగులేని నీ మద్దతు, హద్దుల్లేని ఆశావాదం నాకు స్ఫూర్తినిచ్చాయి. నీ ప్రపంచాన్ని మార్చేశావ్‌.. అందుకు ధన్యవాదాలు.

నిజానికి నువ్వులేని నా జీవితాన్ని నేను ఊహించుకోలేను. ప్రేమకు నిజమైన అర్థం ఏంటో చూపించావ్‌, నువ్వు నా వైపు నిల్చున్నందుకు ఎంతో గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. నాపై నువ్వు చూపించే నమ్మకం నాకెంతో బలాన్ని ఇచ్చి.. నన్ను నేను ముందుకు నడిపించింది. ఇంక నీ అంతనమైన ప్రేమ.. నువ్వు ఎలాంటి మంచి మనిషియో తెలియజేసింది. నేను కుటుంబానికి దూరంగా ఉన్నా.. నువ్వు మన ముగ్గురు పిల్లలను ఎంతో బాగా చూసుకున్నావ్‌. ఒక్కదానివే వాళ్లును పెంచడం భారంగా అనిపించిందని ఎప్పుడూ నాతో చెప్పలేదు. నువ్వు ఎంతో దృఢమైన, విధేయత ఉన్న దానివి. మన ముగ్గురు ఆడపిల్లలకు నిన్ను మించిన రోల్‌ మోడల్‌ ఉండరు. ఈ అద్భుతమైన జీవితంలో నా భాగస్వామిగా ఉన్నందుకు థ్యాంక్స్‌. నీ మద్దతుకు, నీ ప్రేమకు ధన్యవాదాలు. నా జీవితంలో నువ్వు ఉన్నందుకు నేను జీవితాంతం చెరీష్‌ చేస్తాను. ఐ లవ్‌ యూ’ అంటూ సుదీర్ఘంగా రాసుకొచ్చాడు. మరి వార్నర్‌ రిటైర్మెంట్‌తో పాటు.. తన భార్యపై అతనికున్న ప్రేమపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments