SNP
టీమిండియాలోని కొంతమంది స్టార్ ఆటగాళ్లు తాజాగా కొత్త వివాదంలో చిక్కుకున్నారు. భారత క్రికెట్ బోర్డు వారిపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మరి ఆ వివాదం ఏంటి? వారిపై బీసీసీఐ ఎందుకు అసంతృప్తిగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియాలోని కొంతమంది స్టార్ ఆటగాళ్లు తాజాగా కొత్త వివాదంలో చిక్కుకున్నారు. భారత క్రికెట్ బోర్డు వారిపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మరి ఆ వివాదం ఏంటి? వారిపై బీసీసీఐ ఎందుకు అసంతృప్తిగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఉంది. తొలి రెండు టెస్టులు ముగిసిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న.. భారత్-ఇంగ్లండ్ జట్లు.. ఈ నెల 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టులో తలపడనున్నాయి. ఒక వైపు రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా టెస్ట్ సిరీస్‌తో బిజీగా ఉంటే.. కొంతమంది స్టార్ ఆటగాళ్లు సరికొత్త వివాదంలో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టెస్ట్ సిరీస్ ఆడని క్రికెటర్లు రంజీల్లో ఆడాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేస్తే.. కొంతమంది ఆటగాళ్లు మాత్రం వాటిని లెక్కచేయకుండా.. అప్పుడే ఐపీఎల్ మూడ్‌లోకి వెళ్లిపోయారని, వాటిపై బీసీసీఐ అసంతృప్తిగా ఉందని జాతీయ మీడియా పేర్కొంటోంది.
జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లు, గాయాలతో నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న ఆటగాళ్లు కాకుండా.. మిగతా వారంతా రంజీలో ఆడాలని బీసీసీఐ సూచించింది. చాలా మంది అదే చేస్తున్నారు. కానీ, టీమిండియా స్టార్ క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్‌తో పాటు పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా మాత్రం రంజీలో ఆడకుండా.. అప్పుడే ఐపీఎల్ 2024 సీజన్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టారు. వీరు ముగ్గురు కలిసి.. బరోడాలో ప్రాక్టీస్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వీరి విషయంలోనే బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇషాన్ కిషన్ విషయంలోనే బీసీసీఐ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తుంది.
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. ఇషాన్‌ను దేశవాళి క్రికెట్ ఆడాలని సూచించాడు. కానీ, ఇషాన్ మాత్రం ద్రవిడ్ మాటను, బీసీసీఐ సూచనను లెక్కచేయకుండా.. పాండ్యాతో కలిసి ఐపీఎల్‌కి ప్రిపేర్ అవుతున్నాడు. మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. కోహ్లీ విషయం వేరు, ఇషాన్, పాండ్యా విషయం వేరే. కోహ్లీ బీసీసీఐ నుంచి అనుమతి తీసుకుని, తన వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరంగా ఉన్నాడు. కానీ, కోచ్, బోర్డు చెప్పినా కూడా ఇషాన్ కిషన్.. దేశవాళి క్రికెట్ ఆడకుండా.. ఐపీఎల్ మూడ్‌లోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం భారత టెస్ట్ జట్టుకు వికెట్ కీపర్ అవసరం ఉంది. అయినా కూడా దేశాని కంటే ఐపీఎల్ ముఖ్యమైపోయింది ఇషాన్‌కు అంటూ క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
All the players will be communicated by BCCI to play for their state team in Ranji Trophy apart from who are in national duty, recovery process at NCA – board is not too happy with few players already in IPL mode. [TOI] pic.twitter.com/riZNPHt3jZ
— Johns. (@CricCrazyJohns) February 12, 2024