వీడియో: బంగ్లాను బురిడీ కొట్టించిన బ్రేవో.. అతడి తెలివికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!

చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్​లో బంగ్లాదేశ్​ను చిత్తు చేసింది ఆఫ్ఘానిస్థాన్. ఈ గెలుపుతో తొలిసారి ఐసీసీ టోర్నీలో సెమీస్​ గడప తొక్కింది రషీద్ సేన. అయితే ఈ విజయంలో వెస్టిండీస్ లెజెండ్ డ్వేన్ బ్రేవోకు ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి.

చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్​లో బంగ్లాదేశ్​ను చిత్తు చేసింది ఆఫ్ఘానిస్థాన్. ఈ గెలుపుతో తొలిసారి ఐసీసీ టోర్నీలో సెమీస్​ గడప తొక్కింది రషీద్ సేన. అయితే ఈ విజయంలో వెస్టిండీస్ లెజెండ్ డ్వేన్ బ్రేవోకు ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి.

చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్​లో బంగ్లాదేశ్​ను చిత్తు చేసింది ఆఫ్ఘానిస్థాన్. ఈ గెలుపుతో తొలిసారి ఐసీసీ టోర్నీలో సెమీస్​ గడప తొక్కింది రషీద్ సేన. అయితే ఈ విజయంలో ఆఫ్ఘాన్ ఆటగాళ్లు, కెప్టెన్ రషీద్ ఖాన్​తో పాటు కోచింగ్ స్టాఫ్​కు కూడా క్రెడిట్ ఇవ్వాలి. కోచ్ జొనాథన్ ట్రాట్​తో పాటు బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రేవో ఆఫ్ఘాన్ సక్సెస్​లో కీలక పాత్ర పోషించారు. ఓడితే ఇంటికి వెళ్లే ప్రమాదం ఉండటంతో వీళ్లిద్దరూ మ్యాచ్​ను చాలా సీరియస్​గా తీసుకున్నారు. క్రంచ్ సిచ్యువేషన్ ఏర్పడటంతో డ్రెస్సింగ్​ రూమ్​ నుంచి బయటకు వచ్చారు. బౌండరీ లైన్ దగ్గర నిలబడి కెప్టెన్ రషీద్​తో పాటు ఇతర ఆటగాళ్లకు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా బ్రేవో అయితే బంగ్లా ఓటమిని శాసించాడు. అతడు చేసిన ఓ పనే ఆఫ్ఘాన్​ను సెమీస్​కు చేర్చిందని చెప్పొచ్చు.

డ్వేన్ బ్రేవో గురించి తెలిసిందే. తాను క్రికెట్ ఆడే రోజుల్లో బాహుబలంతో పాటు బుద్ధి బలాన్ని కూడా వాడేవాడు. స్లో బౌన్సర్స్, స్వింగ్ డెలివరీస్ వేస్తూ తెలివిగా బ్యాటర్ల పని పట్టేవాడు. ఇవాళ బంగ్లాతో పోరు సమయంలోనూ తన బుర్రకు పని చెప్పాడతను. తెలివిగా ప్రత్యర్థి జట్టును బురిడీ కొట్టించాడు. అది రెండో ఇన్నింగ్స్ 19వ ఓవర్. బంగ్లా గెలుపునకు ఇంకో 8 బంతుల్లో 9 పరుగులు కావాలి. అప్పుడు క్రీజులోకి అడుగుపెట్టాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్. ఈ తరుణంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న బ్రావో స్మార్ట్​గా వ్యవహరించాడు. అతడితో పాటు పేసర్ ఫజల్​హక్ ఫారుకీ కూడా అక్కడే ఉన్నాడు. ఈ టైమ్​లో కెమెరా వైపు తదేకంగా చూసిన బ్రేవో.. అది తన వైపు ఫోకస్ చేసే వరకు వెయిట్ చేశాడు. కెమెరా ఫోకస్ పడగానే ఫారుకీకి ఓ సూచన చేశాడు.

ముస్తాఫిజుర్ లెఫ్టాండర్ కాబట్టి అతడికి బౌన్సర్ వేయాల్సిందిగా బౌలర్​ నవీనుల్ హక్​కు చెప్పమని ఫారుకీకి వివరించాడు బ్రేవో. దీంతో పిచ్ దగ్గరకు వచ్చిన ఫారుకీ ఇదే మెసేజ్​ను కెప్టెన్ రషీద్​కు చెప్పాడు. అప్పటికి అంపైర్​తో ఏదో విషయం డిస్కస్ చేస్తున్న రషీద్ ఇదే విషయాన్ని నవీన్​కు చెప్పాడు. అయితే ఈ విజువల్స్ అన్ని కెమెరాల ద్వారా టెలికాస్ట్ అవడం, కామెంటేటర్ కూడా దీన్ని గమనించి లైవ్​లో చెప్పడం, బౌన్సర్ కోసం సెపరేట్​గా ఎక్స్​ట్రా ఫీల్డర్​ను కూడా పెట్టడంతో బంగ్లాదేశ్ అలర్ట్ అయింది. వాళ్ల డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఓ ప్లేయర్ వచ్చి నెక్స్ట్ బౌన్సర్ వేస్తారంటూ ముస్తాఫిజుర్​ను హెచ్చరించి వెళ్లిపోయాడు. దీంతో నిజంగానే బౌన్సర్ వేస్తారనుకొని క్రీజు లోపల నిలబడ్డాడతను.

నవీనుల్ హక్ అనూహ్యంగా ఫుల్ లెంగ్త్ డెలివరీ వేయడంతో అది కాస్తా వచ్చి ప్యాడ్స్​కు తగిలి ఎల్బీడబ్ల్యూ అయింది. బౌన్సర్ కోసం వెయిట్ చేస్తే.. ఫుల్ లెంగ్త్ బాల్ రావడంతో దాన్ని డిఫెండ్ చేయడంలో ముస్తాఫిజుర్ లేట్ అయ్యాడు. అయితే ఇది పూర్తిగా బ్రేవో చేసిన బ్లఫ్ అని తర్వాత తేలింది. కావాలనే బంగ్లాదేశ్​ను కన్​ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశంతో బౌన్సర్ వేస్తున్నట్లు కెమెరా వైపు చూపిస్తూ అతడు నటించాడు. ఇదే విషయాన్ని రషీద్​కు కూడా అలాగే చెప్పడం, ఫీల్డ్ సెట్ చేయడంతో బంగ్లా నమ్మేసింది. కానీ అనూహ్యంగా బౌన్సర్​కు బదులు ఫుల్ లెంగ్త్ డెలివరీ వేయడంతో తప్పు తెలుసుకుంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఇలా తన తెలివితో బంగ్లాను బోల్తా కొట్టించాడు బ్రేవో. మరి.. బ్రేవో చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments