ఒకే మ్యాచ్‌.. ఒకే ఇన్నింగ్స్‌లో 6 సెంచరీలు చేసిన పాకిస్థాన్‌ ప్లేయర్లు! ఇది మామూలు రికార్డ్‌ కాదు

Harry Brook, ENG vs PAK, Virender Sehwag, Multan, Cricket News: ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు సెంచరీలు కొట్టేశారు. ఈ రికార్డు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Harry Brook, ENG vs PAK, Virender Sehwag, Multan, Cricket News: ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు సెంచరీలు కొట్టేశారు. ఈ రికార్డు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఒకే ఇన్నింగ్స్‌లో 6 సెంచరీలా? అని ఆశ్చర్యపోతున్నారా? అవును మరి పాకిస్థాన్‌ తల్చుకుంటే.. ఇలాంటి నమ్మలేని రికార్డులు ఎన్నో తిరగరాస్తుంది మరి. తాజాగా ఒకే ఇన్నింగ్స్‌లో 6 సెంచరీలు నమోదు చేసింది. అయితే.. వాళ్లు బ్యాటర్లు కాదులేండీ.. బౌలర్లు. స్వదేశంలోని ముల్తాన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లు పాకిస్థాన్‌ ఈ చెత్త రికార్డును మూటగట్టకుంది. ఇంగ్లండ్‌-పాకిస్థాన్‌ మధ్య ముల్తాన్‌లో అక్టోబర్‌ 7 నుంచి తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం అయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ షఫీఖ్‌ 102, కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ 151, అఘా సల్మాన్‌ 104, సౌద్‌ షకీల్‌ 82 పరుగులతో రాణించారు. బాబర్‌ ఆజమ్‌ మాత్రం కేవలం 30 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు.

ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ పరుగుల వరద పారించింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 7 వికెట్లు కోల్పోయి ఎన్ని పరుగులు చేసిందో తెలుసా? ఏకంగా 823 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది. హ్యారీ బ్రూక్‌ ఏకంగా ట్రిపుల్‌ సెంచరీతో కదంతొక్కాడు. సీనియర్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ డబుల్‌ సెంచరీతో సత్తా చాటాడు. బ్రూక్‌ కేవలం 322 బంతుల్లోనే 317 పరుగులు సాధించాడు. అందులో 29 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. అంతకంటే ముందు.. జో రూట్‌ కూడా విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. 375 బంతుల్లో 17 ఫోర్లతో 262 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. మొత్తంగా 7 వికెట్ల నష్టానికి 823 చేసి.. తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. రూట్‌ డబుల్‌ సెంచరీ, బ్రూక్‌ ట్రిపుల్‌ సెంచరీతో చెలరేగగా.. జాక్‌ క్రాలే 78, డకెట్‌ 84 పరుగులు చేసి రాణించారు.

ఇంగ్లండ్‌ బ్యాటర్లు ఇలా చెలరేగడంతో.. పాపం పాకిస్థాన్‌ బౌలర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. మొత్తం ఏడుగురు బౌలర్లు బౌలింగ్‌ చేస్తే.. అందులో ఆరుగురు ఏకంగా వందకుపైగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ విధంగా ఈ ఆరుగురు బౌలర్లు సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. షాహీన్‌ అఫ్రిదీ 26 ఓవర్లలో 120, నషీమ్‌ షా 31 ఓవర్లలో 157, అబ్రార్‌ అహ్మద్‌ 35 ఓవర్లలో 174, అమిర్‌ జమాల్‌ 24 ఓవర్లలో 126, అఘా సల్మాన్‌ 118, సైమ్‌ అయ్యూబ్‌ 14 ఓవర్లలో 101 పరుగులు సమర్పించుకున్నారు. సైద్‌ షకీల్‌ ఒక్కడే కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి 14 రన్స్‌ ఇచ్చాడు. ఇలా పాక్‌ బౌలర్లు సెంచరీల మీద సెంచరీలు పోటీ పడి దాటేశారు. మరి పాక్‌ బౌలర్లను ఈ రేంజ్‌లో ఉతికి ఆరేసిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments