Somesekhar
మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ 'మిస్ ఫర్ ఫెక్ట్'. బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ కీ రోల్ పోషించిన ఈ సిరీస్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో.. రివ్యూలో చూద్దాం పదండి.
మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ 'మిస్ ఫర్ ఫెక్ట్'. బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ కీ రోల్ పోషించిన ఈ సిరీస్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో.. రివ్యూలో చూద్దాం పదండి.
Somesekhar
లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన తొలి వెబ్ సిరీస్ ‘మిస్ ఫర్ ఫెక్ట్’. మెగా కోడలు అయిన తర్వాత లావణ్యనుంచి వస్తున్న తొలి వెబ్ సిరీస్ కావడంతో.. ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. విశ్వక్ ఖండేరావు ఈ సిరీస్ కు దర్శకత్వం వహించగా.. బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ కీలక పాత్రలో నటించాడు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలను క్రియేట్ చేసింది మిస్ ఫర్ ఫెక్ట్. తాజాగా ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ప్రేక్షకులను లావణ్య ఏ మేరకు మెప్పించింది? ఈ రివ్యూలో చూద్దాం.
లావణ్య రావు(లావణ్య త్రిపాఠి) ఢిల్లీలో ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమెకు హైదరాబాద్ పోస్టింగ్ రావడంతో.. ఇక్కడికి వచ్చి ఓ అపార్ట్ మెంట్ లో ఉంటుంది. ఈ క్రమంలోనే పని మనిషి జ్యోతి పరిచయం అవుతుంది. లావణ్య రాగానే లాక్ డౌన్ విధంచడంతో.. జ్యోతి పనికి రాలేకపోతుంది. ఇదే విషయాన్ని చెప్పి ఆమెకు చెప్పి.. పక్కనే ఉండే రోహిత్(అభిజిత్)కు చెప్పమని చెబుతుంది. దీంతో అతడి రూమ్ కు వెళ్లిన లావణ్యకు, రోహిత్ కు ఏ విధంగా పరిచయం ఏర్పడింది? వారి పరిచయం కాస్త ప్రేమకు ఎలా దారి తీసింది? మధ్యలో జ్యోతి ప్లేస్ లో వచ్చిన లక్ష్మి ఎవరు? రోహిత్-లావణ్యల పెళ్లి జరిగిందా? తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
‘మిస్ ఫర్ ఫెక్ట్’ వెబ్ సిరీస్ లాక్ డౌన్ టైమ్ బ్యాక్ డ్రాప్ లో తీసింది. అన్ని ఫర్ ఫెక్ట్ గా, శుభ్రంగా ఉండాలనుకునే అమ్మాయి, నీట్ గా లేకున్నా పర్వాలేదు అనుకునే అబ్బాయి మధ్య జరిగే కథే ఈ వెబ్ సిరీస్ స్టోరీ. మెుత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ క్లీన్ ఫ్యామిలీ వెబ్ సిరీస్. ఈ మధ్యకాలంలో ఎలాంటి అడల్ట్ సీన్స్, బూతులు లేకుండా వచ్చిన తొలి వెబ్ సిరీస్ ఇదే అనుకుంటా. తొలి ఎపిసోడ్ లో లావణ్య-రోహిత్ ల పరిచయం, ప్రేమలో పడటం, ప్రతీది శుభ్రంగా ఉండాలనుకోవడం లాంటి సీన్స్ తో కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. అయితే ఆ తర్వాత కాస్త ఇంట్రెస్టింగ్ కలుగుతుంది. కొత్త కొత్త పాత్రలు వస్తూ ఉండటంతో కథలో వేగం పెరుగుతుంది.
అయితే సింగర్ కావాలనుకున్న జ్యోతి కల నెరవేరిందా? అన్నది తెరపైనే చూడాలి. అందుకోసం ఆమె ఎన్నో పనులు చేస్తుంటుంది. లక్ష్మి రోహిత్ ఇంటికి వెళ్లడం క్లీన్ చెయ్యడం లాంటివి ప్రేక్షకులకు కాస్త బోర్ కొట్టిస్తాయి. ఇక లక్ష్మి ఎవరు? అని తెలుసుకునే క్రమంలో కాస్త కామెడీ జనరేట్ చేశాడు దర్శకుడు. ఇక లావణ్య తండ్రి హర్షవర్దన్, ఝాన్సీ లవ్ ట్రాక్ రొటిన్ కావడంతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు డైరెక్టర్. అయితే లక్ష్మి ఎవరో తెలుసుకున్న తర్వాత రోహిత్ ఎలా రియాక్ట్ అయ్యాడన్నది చూడాల్సిన ట్విస్ట్. దర్శకుడు ఆ ట్విస్ట్ ను రివీల్ చేసిన విధానం, దానికి రోహిత్ రియాక్ట్ అయిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఇక క్లైమాక్స్ కూడా అభిమానులు ఊహించినట్లుగానే డిజైన్ చేశాడు డైరెక్టర్.
టైటిల్ పాత్రకు న్యాయం చేసింది మెగా కోడులు లావణ్య త్రిపాఠి. మిస్ ఫర్ ఫెక్ట్ గా అతి శుభ్రం చేసే ఓసీడీ ఉన్న పాత్రలో జివించేసింది లావణ్య. ఆమె యాక్టింగ్ కు వంద శాతం న్యాయం చేసింది. ఇక రోహిత్ పాత్రలో అభిజీత్ మెప్పించాడు. జ్యోతి పాత్ర చేసిన అమ్మాయి కూడా బాగానే చేసింది. మిగిలిన నటీ, నటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ విభాగానికి వస్తే.. ఈ సిరీస్ కు ప్రధాన ఆకర్షన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి. ప్రశాంత్ ఆర్. విహారి తన నేపథ్య సంగీతంతో వెబ్ సిరీస్ ను వేరే లెవల్ కి తీసుకెళ్లాడు. కెమెరా పనితం బాగుంది. విజువల్ గా కట్టిపడేశాడు కెమెరా మెన్ ఆదిత్య. ఇక ఎడిటర్ రవితేజ గిరిజాల తన కత్తెరకు ఇంకాస్త పదునుపెట్టాల్సి ఉందనిపిస్తోంది. నిర్మాణ విలువలు ఎక్కడా వేలెత్తి చూపించే విధంగా లేవు. ఫైనల్ గా దర్శకుడు విశ్వక్ ఖండేరావు పనితం మెచ్చేవిధంగా ఉంది. ‘ఇక చివరి మాట.. ఫ్యామిలీతో చూసే క్లీన్ క్వీన్ వెబ్ సిరీస్ ఈ మిస్ ఫర్ ఫెక్ట్’
(గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)