MP పదవికి రాజీనామా చేసిన CM రేవంత్ రెడ్డి!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు తన రాజీనామా లేఖను సమర్పించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు తన రాజీనామా లేఖను సమర్పించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలుపొంది రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నిన్న అనగా డిసెంబర్ 07న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 11 మంది మంత్రులుగా చేశారు. దీంతో తెలంగాణలో నూతన ప్రభుత్వం కొలువుదీరినట్లైంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీఎంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేవంత్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన అనతంరం 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. ఎంపీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి రేవంత్ ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి సారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఈ మేరకు శుక్రవారం లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు తన రాజీనామా లేఖను సమర్పించారు. రేపు అనగా డిసెంబర్ 09న రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి పార్టీకి ఆయువుపట్టులా మారారు. రేవంత్ రెడ్డి పార్టీ బలపడేందుకు చేస్తున్న పనితనాన్ని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ ను టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. పార్టీ పగ్గాలు చేపట్టిన ఆ క్షణం నుంచి రేవంత్ అలుపెరుగని పోరాటం చేశారు. తెలంగాణలో పార్టీ మనుగడే కష్టమన్న సమయంలో నేనున్నానని కార్యకర్తల్లో జోష్ నింపి పార్టీ బలపడేందుకు కృషి చేశారు. నేడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి తన సత్తా ఏంటో చూపించారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ అని విమర్శించిన వారి నోళ్లను మూయించారు.

Show comments