Nitya Menon Masterpeace Web Series: ‘మాస్టర్ పీస్’ వెబ్ సిరీస్ రివ్యూ!

‘మాస్టర్ పీస్’ వెబ్ సిరీస్ రివ్యూ!

ఓటిటిలు వచ్చాక ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ విషయంలో కొదవ లేకుండా పోయింది. ముఖ్యంగా సినిమాల పరంగా బిజీ లేని యాక్టర్స్ అందరికీ ఓటిటిలు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఓవైపు సినిమాలు చేస్తూ.. ఓటిటిల వైపు అడుగులు వేస్తున్న తారలు కూడా ఉన్నారు. రీసెంట్ గా కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ తో తెలుగు ఆడియన్స్ ని మెప్పించారు హీరోయిన్ నిత్యమేనన్.

ఓటిటిలు వచ్చాక ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ విషయంలో కొదవ లేకుండా పోయింది. ముఖ్యంగా సినిమాల పరంగా బిజీ లేని యాక్టర్స్ అందరికీ ఓటిటిలు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఓవైపు సినిమాలు చేస్తూ.. ఓటిటిల వైపు అడుగులు వేస్తున్న తారలు కూడా ఉన్నారు. రీసెంట్ గా కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ తో తెలుగు ఆడియన్స్ ని మెప్పించారు హీరోయిన్ నిత్యమేనన్.

ఓటిటిలు వచ్చాక ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ విషయంలో కొదవ లేకుండా పోయింది. ముఖ్యంగా సినిమాల పరంగా బిజీ లేని యాక్టర్స్ అందరికీ ఓటిటిలు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఓవైపు సినిమాలు చేస్తూ.. ఓటిటిల వైపు అడుగులు వేస్తున్న తారలు కూడా ఉన్నారు. రీసెంట్ గా కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ తో తెలుగు ఆడియన్స్ ని మెప్పించిన హీరోయిన్ నిత్యమేనన్. ఇప్పుడు మరో ఎంటర్టైనింగ్ వెబ్ సిరీస్ ‘మాస్టర్ పీస్’తో అలరించేందుకు రెడీ అయిపోయింది. డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ మొదలైన ఈ సిరీస్ ఎలా ఉందో.. ఇప్పుడు రివ్యూలో చూద్దాం!

కథ:

ఈ సిరీస్.. రియా(నిత్యమీనన్), బినోయ్(షరఫ్ యూ డీన్) క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. రియా, బినోయ్ ఇద్దరు భార్యాభర్తలు. సిటీలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ లో జీవనం సాగిస్తుంటారు. పెళ్ళై నాలుగేళ్లు అయినా పిల్లలు లేరనే బాధతో ఉంటారు. కట్ చేస్తే.. ఓరోజు రియా తన భర్త బినోయ్ పై కత్తితో దాడి చేస్తుంది. అక్కడినుండి వారిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ.. సపరేట్ గా ఉంటారు. ఈ విషయం తెలిసి అటు రియా పేరెంట్స్, ఇటు బినోయ్ పేరెంట్స్ ఇంటికి వచ్చి.. వీళ్ల కాపురం చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. మరి రియా భర్తపై కత్తితో దాడి చేయాల్సిన అవసరం ఏముంది? అసలు వారి మధ్య గొడవకు దారి తీసిన కారణం ఏంటి? ఇద్దరి పేరెంట్స్ వచ్చాక కాపురం సెట్ అయ్యిందా లేదా? తెలియాలంటే సిరీస్ లో చూడాల్సిందే.

విశ్లేషణ:

జనరల్ గా భార్యాభర్తల మధ్య గొడవలు, విడిపోవడం.. మళ్ళీ బంధువులు, కుటుంబీకులు వచ్చి కలపడం.. ఇలాంటి లైన్ తో సినిమాలు చాలా వచ్చాయి. తెలుగులో ఎన్నో చూశాం. కూతురు అత్తారింటికి వెళ్లి.. మళ్ళీ కొద్దిరోజులకు భర్తతో గొడవపడి అమ్మగారి ఇంటికి రావడం అనే లైన్ పై ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్క కట్టలేము. కానీ.. ఎండ్ ఆఫ్ ది డే భార్యాభర్తలు ఇద్దరు కలవడమే సినిమా ప్రధాన లక్ష్యం. వారిద్దరిని కలపడమే కథకుడి బాధ్యతగా చెప్పుకోవచ్చు. కాకపోతే.. లైన్ చిన్నదే అయినా.. సిరీస్ లో ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. సిరీస్ ఆరంభం ఎలాంటి సోది లేకుండా స్ట్రెయిట్ పాయింట్ కి వెళ్ళిపోయాడు దర్శకుడు శ్రీజిత్.

అసలు కథలో ట్విస్ట్ ఎక్కడ ఉంటుందో.. అదే పాయింట్ తో సిరీస్ ని స్టార్ట్ చేశాడు. రియా, బినోయ్ క్యారెక్టర్స్ గొడవపడి.. భర్తపైకి రియా బీర్ బాటిల్ విసిరే షాట్ తో కథ మొదలవుతుంది. ఆరంభం అదిరింది అనిపించినా.. ముందుకు వెళ్తున్నకొద్దీ.. ఇంటెన్స్ తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలైనా.. సిరీస్ లైనా.. స్క్రీన్ ప్లే అనేది ఎప్పుడు స్పీడ్ గా ఉంటేనే బాగుంటుంది. చూసేవాడికి బోర్ ఫీల్ రాదు. మాస్టర్ పీస్ లో అదే మేజర్ మైనస్. మొదటి ఎపిసోడ్ నుండే స్లో నేరేషన్ ఇబ్బంది పెడుతుంది. రియా, బినోయ్ ల పేరెంట్స్ వచ్చాక కథ వీళ్ల నుండి వాళ్ల వైపు మళ్ళుతుంది అంతే. పెద్దగా హుషారు కనిపించదు.

ఎక్కడైనా ఎప్పుడైనా.. అత్తకోడలు ఎదురుపడితే లేదా ఒకే ఇంట్లో ఉంటే.. అత్త పెత్తనం చలాయించే ప్రయత్నం చేస్తుంటుంది. ఇందులో కూడా అదే చూపించారు. అయితే.. కథకు మూల కారణమైన రియా, బినోయ్ ల గొడవ మాత్రం ఏమంత కొత్తగా ఉండదు. అలకలు, గొడవలు అనేవి ప్రతీ కపుల్ మధ్య ఉండేవే. స్టోరీలో బలంగా ప్రేక్షకులు లీనమయ్యే ఇంటెన్సిటీ మిస్ అయ్యింది. మధ్యలో వేరే క్యారెక్టర్స్ ఎంటర్ అయినా.. కథకు బలాన్నిచ్చే విధంగా సాగలేదు. ఇక కథ మొదలైనప్పటి నుండి అసలు భార్య భర్తల మధ్య గొడవ ఏంటనేది తెలియడానికి చాలా టైమ్ పడుతుంది. అది కాస్త ఓపికకు పరీక్ష పెడుతుంది.

ఎందుకంటే.. అసలు ఏ పర్పస్ మీద రియా, బినోయ్ గొడవపడ్డారు అనేది తెలియకుండా ప్రేక్షకులు దృష్టి ఎలా పెడతారు.. ఆ సమస్య ఏంటనేది లాస్ట్ 5వ ఎపిసోడ్ లో చూపించడం సహనానికి పరీక్ష పెట్టినట్లే. ఒకే అపార్ట్మెంట్ లో జరిగే కథను ఎపిసోడ్స్ గా చేసి చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఐదు ఎపిసోడ్స్ చూశాక కూడా ఇదేనా కథ అనిపిస్తుంది. అదే ఈ సిరీస్ కి మైనస్. ఉన్న కథ కూడా ఎంగేజింగ్ గా ఉండకపోవడం మరో రిమార్క్. ఇందులో అడల్ట్ సీన్స్ ఏం లేవు. కెమెరా వర్క్ బాగుంది. దర్శకుడిగా శ్రీజిత్ కంప్లీట్ గా న్యాయం చేయలేదు. మ్యూజిక్ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఓకే. ఇక రియా క్యారెక్టర్ లో నిత్య, బినోయ్ పాత్రలో షరఫ్ ఆకట్టుకున్నారు.

ప్లస్​లు:
నిత్యా, షరఫ్
కెమెరా వర్క్

మైనస్ లు:
రొటీన్ కథ
స్క్రీన్ ప్లే
వీక్ సపోర్టింగ్ క్యారెక్టర్స్

చివరిమాట: మాస్టర్ పీస్.. కొత్త పీస్ కాదు!

రేటింగ్: 1.5/5

(గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)
Show comments