Tirupathi Rao
Cadets OTT Release & Streaming Plotform: ఓటీటీలోకి ఒక క్రేజీ వార్ డ్రామా వచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ కచ్చితంగా మీరు కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తుంది. ఎందుకంటే దేశం కోసం జవాన్లు ఇన్ని కష్టాలు పడతారా? అనే విషయాన్ని స్పష్టంగా చూపించారు.
Cadets OTT Release & Streaming Plotform: ఓటీటీలోకి ఒక క్రేజీ వార్ డ్రామా వచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ కచ్చితంగా మీరు కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తుంది. ఎందుకంటే దేశం కోసం జవాన్లు ఇన్ని కష్టాలు పడతారా? అనే విషయాన్ని స్పష్టంగా చూపించారు.
Tirupathi Rao
ఓటీటీలోకి ప్రతి వారం వెబ్ సిరీస్లు, కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని నవ్విస్తే.. కొన్ని ఆలోచింపజేస్తాయి.. మరికొన్ని మాత్రం ఎమోషనల్ అయ్యేలా చేస్తాయి. అలాంటి ఒక వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇది మొత్తం ఇండియన్ ఆర్మీ, వాళ్ల ట్రైనింగ్, వార్ బేస్డ్ గా సాగే ఎమోషనల్ డ్రామా. ఇందులో ఉండే లీడ్ యాక్టర్స్ మిమ్మల్ని నవ్విస్తారు, ఏడిపిస్తారు, మీరు కూడా ఏదో ఒకటి సాధించేలా మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసిన ఈ వెబ్ సిరీస్.. అప్పుడే ట్రెండింగ్ కూడా అవుతోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ సిరీస్ గురించే పోస్టులు కనిపిస్తున్నాయి.
రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈ సిరీస్ ఎందుకు ట్రెండింగ్ లోకి వచ్చింది? ఎందుకంటే ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ఎంతో ఉత్కంఠగా సాగింది. నిజానికి ఆ ట్రైలర్ చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాకుండా ఉండవు. అందుకే ఈ సిరీస్ కోసం ఓటీటీ ఆడియన్స్ అంతలా ఎదురుచూశారు. అలా ఓటీటీలోకి రాగానే.. ఇలా వైరల్ అవుతోంది. ఈ సిరీస్ ని కార్గిల్ వార్ కి ముందు జరిగేదిలా చూపించారు. ఈ సిరీస్లో తనయ్ ఛేడా, చయాన్ చోప్రా, తుషర్ షాహీ, గౌతమ్ సింగ్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. వీళ్లు ఇండియన్ ఆర్మీ అకాడమీలో ఎలా చేరారు? ట్రైనింగ్ సమయంలో ఎంత బద్దకంగా ఉన్నారు? వీళ్లకు ఆర్మీలో అవకాశం ఎలా వచ్చింది? ఎంతో బద్దకంగా, భయంగా ఉన్న వీళ్లు ఎలా దేశాన్ని కాపాడే హీరోల్లో ఒకటిగా మారారు అనే పాయింట్స్ మీద ఈ వెబ్ సిరీస్ సాగుతూ ఉంటుంది.
కొన్ని సన్నివేశాలకు కచ్చితంగా కన్నీళ్లు పెట్టేసుకుంటారు. ఎందుకంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ లోకి వెళ్లాలి అంటే ఇన్ని కష్టాలు పడాలా? దేశ రక్షణ కోసం జవాన్లు ఇన్ని కష్టాలను భరిస్తారా? అనే ప్రశ్నలు రాకమానవు. అలాగే ఈ సిరీస్ లో కేవలం యాక్షన్ మాత్రమే కాదు.. ఎమోషన్ కూడా ఉంటుంది. అలాగే ఇందులో మంచి ఫ్రెండ్ షిప్ కూడా ఉంది. అకాడమీలోకి వచ్చిన దగ్గరి నుంచి.. రిక్రూట్మెంట్ వరకు.. యుద్ధంలో పాల్గొనేంత వరకు వాళ్ల మధ్య జరిగిన ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ చూసి ఎవరైనా కుర్రాళ్లు నేను ఆర్మీకి వెళ్లిపోతా అని అడిగినా అడిగే అవకాశం ుంది. ఈ సిరీస్ పేరు క్యాడెట్స్. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సిరీస్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. క్యాడెట్స్ వెబ్ సిరీస్ చూసేందుకు క్లిక్ చేయండి.