Swetha
ఓటీటీ లో ఎన్నో సినిమాలు, సిరీస్ లు ఉంటూనే ఉంటున్నాయి. ముఖ్యంగా వీటిలో కొంతమంది కేవలం అడల్ట్ కంటెంట్ మూవీస్ ను చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ మిస్ చేస్తే మాత్రం ఒక మంచి అడల్ట్ సిరీస్ సీజన్స్ ను మిస్ చేసినట్లే.
ఓటీటీ లో ఎన్నో సినిమాలు, సిరీస్ లు ఉంటూనే ఉంటున్నాయి. ముఖ్యంగా వీటిలో కొంతమంది కేవలం అడల్ట్ కంటెంట్ మూవీస్ ను చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ మిస్ చేస్తే మాత్రం ఒక మంచి అడల్ట్ సిరీస్ సీజన్స్ ను మిస్ చేసినట్లే.
Swetha
సినిమా అంటే అన్ని జోనర్స్ ఉంటాయి. లవ్, యాక్షన్, డ్రామా, అన్ని ఉంటాయి . ఇవన్నీ అందరితో కలిసి కూర్చుని చూసేయొచ్చు. కానీ కొంతమంది మాత్రం కొన్ని సినిమాలను ఒంటరిగా చూడాలని అనుకుంటారు. అంటే కొన్ని సినిమాలు, సిరీస్ లలో అడల్ట్ కంటెంట్ సీన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ జోనర్ లో వచ్చే సినిమాలను చూసేందుకు యూత్ అంతా కూడా ఎంతో ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. చాలా వరకు ఈ జోనర్ లో వచ్చే సినిమాలను అన్నిటిని కూడా మూవీ లవర్స్ వదిలిపెట్టరు. ఒరిజినల్ లాంగ్వేజ్ లో లేకపోయినా సరే..ఆ మూవీస్ ను చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కూడా ఇలాంటి జోనర్ కు సంబంధించిందే. మరి ఆ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
ఈ హాలీవుడ్ సిరీస్ పేరు “ఎలైట్”. ఈ వెబ్ సిరీస్ స్పానిష్ లాంగ్వేజ్ లో 2018 లో విడుదలైంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సిరీస్ మొత్తం ఏడు సీజన్స్ గా రిలీజ్ అయింది. ప్రతి సీజన్ లో ఏడు నుంచి ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ 40 నుంచి 50 నిమిషాల నిడివి ఉంటుంది. అలాగే ప్రతి ఎపిసోడ్ లోను అడల్ట్ కంటెంట్ సీన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఒంటరిగా సిరీస్ కు చూడాలి అనుకునే వారికి ఈ సిరీస్ బెస్ట్ ఛాయస్. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. నిజానికి ఈ సిరీస్ స్పానిష్ లో ఒక బెంచ్ మార్క్ ను సెట్ చేసిందని చెప్పి తీరాలి. ఈ సిరీస్ మొదట స్పానిష్ లోనే రిలీజ్ చేసినా కూడా.. రీసెంట్ గా తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఈ సిరీస్ లో అని సీజన్స్ చూసిన తర్వాత.. ఖచ్చితంగా ఒక వర్త్ వాచింగ్ సిరీస్ అని ఫీల్ అవ్వడం గ్యారంటీ.
ఎలైట్ సిరీస్ స్టోరీ విషయానికొస్తే.. ఈ సిరీస్ కేవలం అడల్ట్ సీన్స్ అండ్ కంటెంట్ అందించడం మాత్రమే కాకుండా.. రిచ్ కు పూర్ కు ఉండే డిఫరెన్స్ , మర్డర్ మిస్టరీ ఇలా చాలా రకాల ప్లాట్స్ ను కనెక్ట్ చేస్తూ ఈ సిరీస్ ను .. సెవెన్ సీజన్స్ గా ముందుకు తీసుకువెళ్తున్నారు. స్పానిష్ లో ఒక రిచ్ కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ లో కేవలం రిచ్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ఈ క్రమంలో అదే కాలేజ్ లో ఒక ముగ్గురు మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కు సీట్ వస్తుంది. కానీ ఆ రిచ్ స్టూడెంట్స్ వీళ్ళని ఎలా అయినా కాలేజ్ నుంచి పంపించేయాలని ప్లాన్ చేస్తారు. మరో వైపు ఆ కాలేజ్ లో ఒక మర్డర్ జరుగుతుంది. దీనితో రిచ్ స్టూడెంట్స్ ఆ మర్డర్ కేస్ లో ఈ ముగ్గురు మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ను ఇన్వాల్వ్ చేస్తారు. అసలు మర్డర్ ఎవరు చేశారు ! ఈ ముగ్గురు మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ దీని నుంచి ఎలా తప్పించుకుని బయటపడ్డారు ! ఆ తర్వాత ఏం జరిగింది ! అసలు చనిపోయింది ఎవరు ! ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఒక్కో సీజన్ లో సమాధానం దొరుకుతుంది. ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.