Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం OTT పార్టనల్‌ లాక్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..!

Saripodhaa Sanivaaram OTT Partner Lock: నాచురల్‌ స్టార్‌ నాని నటించిన సరిపోదా శనివారం సినిమా.. ఆగస్టు 29, గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో సినిమా ఓటీటీ పార్టనర్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆ వివరాలు..

Saripodhaa Sanivaaram OTT Partner Lock: నాచురల్‌ స్టార్‌ నాని నటించిన సరిపోదా శనివారం సినిమా.. ఆగస్టు 29, గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో సినిమా ఓటీటీ పార్టనర్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆ వివరాలు..

నాని.. క్యూట్‌, ఫ్యామిలీ, రొమాంటిక్‌ సినిమాలు అనగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చే పేరు. అయితే అప్పుడప్పుడు రోటిన్‌కి భిన్నంగా యాక్షన్‌ సినిమాలు కూడా చేస్తుంటాడు. గతంలో దసరా అనే యాక్షన్‌ మూవీతో బాక్సాఫీస్‌ దగ్గర దుమ్ము రేపిన నాని.. కొన్ని రోజుల గ్యాప్‌ తర్వాత మరో మాస్‌ ఎంటర్‌టైన్‌ యాక్షన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే సరిపోదా శనివరం మూవీ. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు అనగా ఆగస్టు 29, గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. గతంలో వివేక్‌ ఆత్రేయ-నాని కాంబోలో అంటే సుందరానికి అనే సినిమా వచ్చింది. అయితే ఇది డీసెంట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.

కానీ ఈసారి మాత్రం వివేక్‌ ఆత్రేయ తన జానర్‌ నుంచి బయటకు వచ్చి తీసిన ఫుల్‌ లెంత్‌ మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సరిపోదా శనివారం సినిమా. మూవీ రిలీజ్‌కు ముందే వచ్చిన ట్రైలర్‌, టీజర్‌, పాటలు సినిమా మీద అంచనాలను భారీగా పెంచాయి. ఇక నేడు సినిమా చూసిన ప్రేక్షకులు మూవీ కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది అంటున్నారు. అదలా ఉంచితే సరిపోదా శనివారం ఓటీటీ పార్టనర్‌ లాక్‌ అయ్యింది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది అంటే..

నేడు థియేటర్‌లో విడుదలైన సరిపోదా శనివారం చిత్రం.. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. టైటిల్‌ కార్డ్స్‌ ద్వారా దీనిపై అధికారికంగా ప్రకటన ఇచ్చేశారు. గత కొన్నాళ్లుగా థియేటర్‌లో విడుదలైన ప్రతి చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్‌.. సరిపోదా శనివారం ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. మరి ఈ చిత్రం  ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌ కానుంది అనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సాధారణంగా అయితే.. కొత్త మూవీ విడుదలైన 4 వారాల తర్వాత అది ఓటీటీల్లోకి రావాల్సి ఉంది. అయితే మూవీ రిజల్ట్‌ని బట్టి.. ఈ సమయం మారుతుంటుంది. మరి సరిపోదా శనివారం నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌ కానుంది అనే దానిపై అధికారిక ప్రకటన వస్తే.. దీనిపై క్లారిటీ రానుంది.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటించిన సరిపోదా శనివారం సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి. దాంతో మూవీ చూసిన అభిమానులు సినిమా ఎలా ఉందో.. ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఫస్టాఫ్ కొద్దిగా ఫ్యామిలీ టచ్ ఇచ్చినప్పటికీ.. సెకండాఫ్‌లో మాత్రం నాని ఊచకోత కోశాడని చెబుతున్నారు. డైరెక్టర్ స్టోరీని చాలా అద్బుతంగా రాసుకున్నాడని, విలన్‌గా ఎస్ జే సూర్య మరోసారి అదరగొట్టేశాడని పేర్కొంటున్నారు. ‘ప్రియాంక మోహన్ చాలా క్యూట్ గా నటించింది, ఆమె బ్యూటీ సినిమాకు ప్లస్ పాయింట్’.. బీజీఎంకి గూస్‌బంప్స్‌ పక్కా అంటూ రాసుకొస్తున్నారు.

Show comments