ఇష్టం లేని భర్తతో కాపురం.. పరాయి వ్యక్తితో?.. OTTలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు చూడాల్సిన మూవీ

ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ చూడాలి అని అనుకునేవారికి ఈ సినిమా మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇన్నాళ్లు ఎందుకు ఈ సినిమాని ఎందుకు చూడలేదా అని అనిపిస్తుంది. అంత గొప్ప సినిమా ఇది.

ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ చూడాలి అని అనుకునేవారికి ఈ సినిమా మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇన్నాళ్లు ఎందుకు ఈ సినిమాని ఎందుకు చూడలేదా అని అనిపిస్తుంది. అంత గొప్ప సినిమా ఇది.

చాలా మంది అమ్మాయిలు ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుంటారు. నచ్చకపోయినా ఆ భర్తతో కాపురం చేస్తుంటారు. కొంతమంది అయితే వేరే వ్యక్తితో ప్రేమలో పడి అతనితో వెళ్ళిపోతారు. ఇలాంటి సీన్స్ సినిమాల్లో చూసే ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం వేరే లెవల్. నిజంగా ప్రేమ అంటే ఇంత అద్భుతంగా ఉంటుందా అని అనిపిస్తుంది. తన భార్య ఇష్టం లేని భర్తతో కాపురం చేస్తున్న విషయం తెలిసిన ఏ భర్తైనా సరే బలవంతంగా ఆమెతో కాపురం చేస్తాడు. తన కోరికలు తీర్చేసుకుంటాడు. కానీ ఈ సినిమాలో అలా కాదు. ఆమె ఇష్టాలను తెలుసుకుని నెరవేర్చి ఆమె కోసం దెబ్బలు తిని బాధలు పడి ఫైనల్ గా ఆమె ప్రేమను పొందుతాడు. ఎమోషనల్ సీన్స్ చూసి ఏడ్చేవారికి ఈ సినిమా బాగా కన్నీరు పెట్టించేస్తుంది. అంత బాగా ఉంటుంది. ఈ జనరేషన్ వాళ్లకి ఈ సినిమా గురించి తెలియకపోవచ్చు. 

కథ:

గురువు మెచ్చిన శిష్యుడు. శిష్యుడు చాలా ఇన్నోసెంట్ గా ఉంటాడు. ఆ గురువుకి ఒక కూతురు ఉంటుంది. కూతురు ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది. కూతురి ప్రేమని అర్థం చేసుకుని ఇద్దరికీ పెళ్లి ఫిక్స్ చేస్తాడు తండ్రి. పెళ్ళికి అంతా సిద్ధం చేస్తారు. అయితే వరుడు వస్తుండగా యాక్సిడెంట్ జరిగి చనిపోతాడు. ఆ వార్త విన్న గురువుకి (హీరోయిన్ తండ్రి) హార్ట్ స్ట్రోక్ వస్తుంది. చనిపోతానని తెలిసి తన కూతురుని శిష్యుడి చేతిలో పెడతాడు. నీతో ఉంటే నా కూతురు సంతోషంగా ఉంటుందని.. అప్పుడే తన ఆత్మ శాంతిస్తుందని అంటాడు. ఇద్దరినీ ఒకటి చేసి చనిపోతాడు. ప్రేమించిన వ్యక్తి చనిపోయిన బాధ నుంచి ఇంకా తేరుకోలేదు. తండ్రికి ఇచ్చిన మాట కోసం తండ్రి శిష్యుడైన సురేందర్ ని భర్తగా స్వీకరిస్తుంది. ఇష్టం లేకపోయినా నాన్నకు ఇచ్చిన మాట కోసం కాపురం చేస్తుంది. అప్పటి వరకూ పక్షిలా ఆడుతూ పాడుతూ ఉన్న ఆమెను సడన్ గా జైల్లో బంధించినట్టు అయ్యింది. కానీ సురేందర్ మాత్రం తానీ గుప్తాను చాలా ప్రేమిస్తాడు. తనతో మాట్లాడదు. సురేందర్ ఒక్కడే వండుకుని ఆమెకు వండిపెట్టి ఆఫీసుకి వెళ్తాడు.

ఆమె డల్ గా ఉండడం చూసి ఒకరోజు ఆమె ఇష్టాలను తెలుసుకుని ఆమెను డ్యాన్స్ క్లాస్ లో చేర్పిస్తాడు సురేందర్. ఆమెకు డ్యాన్స్ అంటే ఇష్టం. అక్కడ రాజ్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ వ్యక్తితో ప్రేమలో పడిపోతుంది. కానీ పెళ్లి అయిపోయింది. తనలో తానే దీన్ని ఎలా ఫేస్ చేయాలా అని మదనపడుతుంటుంది తానీ. ఇన్నోసెంట్ భర్తతో ఉండాలా? లేక ఇంటిలిజెంట్ ప్రియుడితో వెళ్లిపోవాలా? ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ఆ ఇంటిలిజెంట్ ప్రియుడు మరెవరో ఆమె భర్తే. మారువేషంలో ఆమె కోసం, ఆమె ప్రేమ కోసం ఒక్కడే ఆమెకు తెలియకుండా ఇద్దరిలా నటిస్తాడు. భర్తగా ఆమెకు ఇవ్వలేని ప్రేమను ఒక ప్రియుడిగా ఆమెకు ఇస్తాడు. కానీ చివరకు ఆమెకు ఈ విషయం తెలిసిపోతుంది. ఆమె ఎవరిని కోరుకుంటుంది? భర్తనా? లేక మారువేషంలో ఉన్న ప్రియుడినా? 

ఎందుకు చూడాలి:?

ఈ కథలో భార్య ప్రేమ కోసం ప్రియుడిగా మారిన భర్త క్యూట్ లవ్ స్టోరీ ఉంది. భర్త ఉండగా పరాయి మగాడితో ప్రేమ ఏంటి అని తనలో తాను సంఘర్షణకు గురయ్యే ఒక ఇల్లాలి కథ ఉంది. అన్నిటికంటే మించి భర్త అంటే ఇష్టం లేని భార్యను అర్థం చేసుకుని.. ఆమె మనసులో చోటు ఎలా దక్కించుకోవాలో అన్న ఒక ఆకస్తికర అంశం ఉంది. ఇందులో ఎమోషన్స్ కి కొదవ లేదు. అమ్మాయిలు హీరోలని ఇష్టపడతారు కదా.. భర్త హీరోలా ఉండాలని అనుకుంటారు కదా. ఒక సీన్ లో సురేందర్ తానీ గుప్తా ముందు హీరో అనిపించుకోవడం కోసం ఒక భారీ మనిషిని ఢీ కొంటాడు. ఈ క్రమంలో దెబ్బలు తింటాడు. గుండెలు పిండేసే సీన్ అది. ఇదొక్కటే కాదు చాలా సీన్లు గుండెలను పిండేసి శరీరాన్ని కన్నీటితో తడిపేస్తాయి. అంత బాగుంటుంది ఈ సినిమా.

ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆ పాటలు నిజంగా భర్యాభర్తల ప్రేమకు ప్రతీకగా నిలుస్తాయి. ఇన్నోసెంట్ భర్తగా షారుక్ ఖాన్, పెళ్లంటే ఇష్టం లేని అమ్మాయిగా అనుష్క శర్మ చాలా అద్భుతంగా నటించారు. కొత్తగా పెళ్ళైన వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అమ్మాయిలు, అమ్మాయికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్న అబ్బాయిలు కలిసి చూడాల్సిన సినిమా. ఒక మంచి సినిమా చూశామన్న అనుభూతి అయితే కలుగుతుంది. వందకు వంద శాతం గ్యారంటీ. ఆ సినిమా పేరు ‘రబ్ నే బనా దీ జోడి’. అమెజాన్ ప్రైమ్ లో ఉంది. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.

Show comments