రేపే విడుదల – అడిగేవాళ్ళు లేరు

ఒకపక్క లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ లు అంత పెద్ద స్టార్లున్నప్పటికీ కనీసం కార్తికేయ 2 ముందు నిలవలేక తుస్సుమన్నాయి.

ఒకపక్క లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ లు అంత పెద్ద స్టార్లున్నప్పటికీ కనీసం కార్తికేయ 2 ముందు నిలవలేక తుస్సుమన్నాయి.

బాలీవుడ్ పరిస్థితి రానురాను మరింత దయనీయంగా మారిపోతోంది. ఒకపక్క లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ లు అంత పెద్ద స్టార్లున్నప్పటికీ కనీసం కార్తికేయ 2 ముందు నిలవలేక తుస్సుమన్నాయి. ఉత్తుత్తి కంటెంట్ ని ఎవరున్నా ఉపేక్షించే సమస్యే లేదని ఆడియన్స్ తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు దొబారా విడుదలవుతోంది. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ను కల్ట్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించాడు. పబ్లిసిటీ ప్రమోషన్లు గట్రా ఎంత బలంగా చేస్తున్నా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం మరీ తీసికట్టుగా ఉన్నాయి. కేవలం తాప్సీ ఇమేజ్ తో ఓపెనింగ్స్ రాబట్టలేమని ఇటీవలే శభాష్ మితు ఋజువు చేయడం అందరికీ గుర్తే.


మరి దొబారాకు జనం ఎగబడిపోతారనుకోవడం అమాయకత్వం. అలా అని ఇది స్ట్రెయిట్ మూవీ కూడా కాదు. స్పానిష్ సూపర్ హిట్ మూవీ మిరేజ్ కి అఫీషియల్ రీమేక్. మన విక్రమ్ కె కుమార్ అప్పుడెప్పుడో మాధవన్ తో తీసిన 13B ఛాయలు ఇందులో ఉంటాయి. అసలే ఈ మధ్య కాలంలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను పబ్లిక్ పట్టించుకోవడం లేదు. కంగనా రౌనత్ దాఖడ్ కి జరిగిన పరాభవం మర్చిపోగలమా. రెండో వారంలోకి వెళ్లకుండా దేశవ్యాప్తంగా కేవలం వేల రూపాయల కలెక్షన్ రావడం చూసి ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరిగింది. ఇప్పుడు దొబారాకు సైతం అదే పరిస్థితి తప్పకపోవచ్చని అక్కడి విశ్లేషకుల అంచనా నిజమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు


మరోవైపు కార్తికేయ 2 నార్త్ బెల్ట్ లో రోజురోజుకి బలపడుతోంది ఏకంగా పదినేను వందల స్క్రీన్లతో మంచి వసూళ్లు రాబడుతోంది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ తిరిగి ఈ వారాంతంలో కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనేలా ఉంది. దగ్గరలో చెప్పుకోదగ్గ హిందీ రిలీజులు ఏవీ లేవు. జనవరిలో షారుఖ్ ఖాన్ పఠాన్ వచ్చే దాకా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండేలా కనిపించడం లేదు. డిసెంబర్ లో రణ్వీర్ సింగ్ – రోహిత్ శెట్టిల సర్కస్ ఉంది కానీ వచ్చేదాకా దాని మీదా ఎక్కువ ఆశలు పెట్టుకోలేం. రణ్వీర్ ఇమేజ్ జయేష్ బాయ్ జోర్దార్ ని కాపాడలేకపోయింది. మొత్తానికి కొత్త మూవీ ఏది వచ్చినా దానిమీద కనీస స్థాయిలో ఆసక్తి లేకపోవడం చూస్తుంటే దొబారాకు టాక్ రాకపోతే గట్టి దెబ్బ తప్పేలా లేదు

Show comments