Arjun Suravaram
లోక్ సభ ఎన్నికల వేళ రాజకీయ హీట్ చాలా హాట్ హాట్ గా ఉంది. టికెట్ దక్కిన వాళ్లు సంబరాలు చేసుకోగా..దక్కని వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓ ఎంపి అయితే ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు.
లోక్ సభ ఎన్నికల వేళ రాజకీయ హీట్ చాలా హాట్ హాట్ గా ఉంది. టికెట్ దక్కిన వాళ్లు సంబరాలు చేసుకోగా..దక్కని వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓ ఎంపి అయితే ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు.
Arjun Suravaram
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి నడుస్తోంది. అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నాయి. ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలో అనేక చోట్ల చాలా రచ్చ జరుగుతోంది. టికెట పొందిన వాళ్లు సంతోష పడుతుంటే..దక్కని వాళ్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం అన్ని పార్టీల్లోనూ కనిపిస్తుంది. టికెట్ దక్కని నేతలు, వారి అనుచరులు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ ఎంపీ మాత్రం దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయం కోసం తన జీవితాన్ని బలి చేసుకున్నారు. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే…
తమిళనాడుకు చెందిన ఎంపీ గణేశ్ మూర్తి కన్నుమూశారు. మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం(ఎండీఎంకే) పార్టీ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. తాజాగా మరోసారి తనకే టికెటు వస్తుందని ఆశ పెట్టుకున్నారు. అయితే ఆయనకు ఎండీఎంకే పార్టీ లోక్ సభ టికెట్ ను నిరాకరించింది. దీంతో గణేశ్ మూర్తి తీవ్రంగా మనస్తాపం చెందారు. కొన్ని రోజుల నుంచి ఎవరితో మాట్లాడటం లేదు. అలానే తనకు టికెట్ దక్కకపోవడంపై తీవ్రమనోవేదనకు గురైన ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే కుటుంబ సభ్యులు, అనుచరులు సకాలంలో స్పందించి స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అక్కడ పరీక్షల అనంతరం ఆయన్ను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆయన ప్రాణపాయ స్థితి నుంచి బయట పడ్డారు. దీంతో ఎంపీ కుటుంబ సభ్యులతో పాటు అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు. అలా ఆత్మహత్యయత్నం నుంచి ప్రాణాలతో బయటపడిన ఆయనను మృత్యువు వదల్లేదు. గురువారం ఉదయం గుండెపోటుతో ఆయన ఆస్పత్రిలోనే కన్నుమూశారు. ఆయన ప్రస్తుతం ఈరోడ్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీ కొనసాగుతున్నారు. గురువారం ఉదయం 5.05 గంటలకు మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఈనెల 24వ తేదీన గణేశమూర్తి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్చగా.. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలోనే గురువారం ఉదయం గుండెపోటు వచ్చి మృతి చెందారు. డీఎంకే పార్టీతో పొత్తులో భాగంగా ఈసారి ఈరోడ్ పార్లమెంట్ ఎంపీ టికెట్ ను గణేశ్ మూర్తికి కేటాయించ లేదు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈరోడ్ లోక్ సభ స్థానం నుంచి గణేశమూర్తి డీఎంకే టికెట్‌పై గెలుపొందారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కూడా తనకే టికెట్ వస్తుందని ఆశ పెట్టుకున్నాడు. అయితే ఆశలు గల్లంతు కావడంతో తీవ్ర నిరాశకు గురైన ఆయన ఆత్మహత్యయత్నం చేశారు. చివరకు గుండెపోటుతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అనుచరులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతి వార్త తెలియగానే అనుచరులు స్థానికంగా బంద్‌కు పిలుపు ఇచ్చారు.
#UPDATE | MDMK MP from Erode, Ganesamoorthy passed away at 5:05 am today due to cardiac arrest. He was hospitalised on March 24 after allegedly attempting suicide. #TamilNadu https://t.co/tGQAZoRuD2
— ANI (@ANI) March 28, 2024