Keerthi
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఫౌండర్, సీఈఓ దీపిందర్ గోయల్ పై తాజాగా ప్రధాని నరేంద్ర మోడి ప్రశంసల వర్షం కురిపించారు. ఎందుకంటే..
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఫౌండర్, సీఈఓ దీపిందర్ గోయల్ పై తాజాగా ప్రధాని నరేంద్ర మోడి ప్రశంసల వర్షం కురిపించారు. ఎందుకంటే..
Keerthi
పేదరికం అనేది అందరికి ఒక ఆర్థిక సమస్య కానీ, మనిషి ఉన్నత స్థాయి ఎదగడానికి అది ఎన్నాడు సమస్య కాదు. ఎందుకంటే.. నేటి సమాజంలో ఒక ఐఏఎస్ ఆఫీసరు అయినా సినీ సెలబ్రిటీస్ అయిన ఎవరైనా సరే మొదట జీరో నుంచే మొదలయ‍్యి ఆ తర్వాత అందరూ గుర్తింపు తెచ్చుకున్న స్థాయికి వెళ్తారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న వ్యక్తి కూడా ఒకరు. ఇతను కటిక పేదరికంలో బతుకును కొనసాగించి నేడు లక్షలది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఆయన మరెవరో కాదు.. ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఫౌండర్, సీఈఓ దీపిందర్ గోయల్. తాజాగా ఈయన పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఎందుకంటే..
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఫౌండర్, సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవలే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ నిర్వహించిన విశేష్ సంపర్క్ కార్యక్రమంలో పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ కార్యక్రమంలో.. జొమాటో సంస్థ ప్రారంభ రోజుల నాటి అనుభవాల్ని ఆ సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ వివరించారు. ఈ క్రమంలోనే.. స్టార్టప్ ప్రారంభించాలన్న ఆలోచన వచ్చాక వెంటనే తన తండ్రితో చర్చించానని, అప్పుడు తన తండ్రి గోయల్‌తో.. ‘నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా? ఇంత చిన్న ఊరిలో మనం ఏం చేయలేం. అది అసాధ్యం.’ అని సందేహం వ్యక్తం చేసినట్లు గుర్తుచేసుకున్నారు.అయితే కేవలం ప్రభుత్వ సహకారంతోనే తన కల సాకారమైంది. ఈ క్రమంలోనే 2008 సంవత్సరంలో జొమాటో సంస్థను స్థాపించడం జరిగింది.
కాగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది మందికి ఉపాధి కల్పించడం పట్ల చాలా సంతోషంగా ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ వీడియోను మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఎక్స్ వేదికగా షేర్ చేయగా.. ఈ వీడియోను ప్రధాని రీపోస్ట్ చేస్తూ స్పందించారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ తన ట్వీట్ లో.. ‘నేటి భారతంలో ఇంటి పేరుతో అసలు పట్టింపే లేదు. కేవలం శ్రమించడం ఇక్కడ ముఖ్యం. పైగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు మీ జర్నీ ఎంతో స్ఫూర్తిదాయకం. స్టార్టప్స్ అభివృద్ధి కోసం అనుకూల వాతావరణాన్ని అందించేందుకు మేం ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం.’ అని మోదీ హామీ ఇచ్చారు. మరి, జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ పై ప్రధాని ప్రశంసలు కురిపించడం పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
In today’s India, one’s surname doesn’t matter. What matters is hardwork. Your journey is truly inspiring, @deepigoyal! It motivates countless youngsters to pursue their entrepreneurial dreams. We are committed to providing the right environment for the startups to flourish. https://t.co/E9ccqYyVzv
— Narendra Modi (@narendramodi) May 22, 2024