చంద్రుడిపై పరిశోధనలకు గాను భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. జాబిల్లి దక్షిణధృవంపై దిగ్విజయంగా దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు అక్కడి ఫొటోలను, వీడియోను పంపించింది. అయితే గత కొన్ని రోజుల నుంచి విక్రమ్ లాండ్యర్, ప్రజ్ఞాన్ రోవర్ లు పనిచేయడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇస్రో మాజీ చీఫ్, స్పేస్ కమిషన్ సభ్యుడు ఏఎస్ కిరణ్ కుమార్ తాజాగా చంద్రయాన్-3పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. చంద్రయాన్-3 కథ ముగిసినట్లేనని, ఇంకా విక్రమ్ లాండ్యర్, ప్రజ్ఞాన్ రోవర్ లు నిద్రాణస్థితిలోనే ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రయాన్-3 ప్రాజెక్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఇస్రో మాజీ చీఫ్ ఏఎస్ కిరణ్ కుమార్. తాజాగా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ..”భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ కథ ఇక ముగిసినట్లే. ఇంకా విక్రమ్ లాండ్యర్, ప్రజ్ఞాన్ రోవర్ లు నిద్రాణస్థితిలోనే ఉన్నాయి. ఇవి రెండూ మేల్కొంటాయన్న ఆశలు సన్నగిల్లాయయి. ఒక వేళ అవి మేల్కొంటే ఇప్పటికే అది జరిగేది. కానీ అవి నిద్రాణస్థితి నుంచి బయటకి వచ్చే అవకాశం లేదు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఇస్రో మాజీ చీఫ్. అయితే చంద్రయాన్-3 తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించిందని పేర్కొన్నారు. అక్కడి నుంచి పంపించిన డేటా భవిష్యత్ లో చేపట్టే ప్రాజెక్ట్ లకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు కిరణ్ కుమార్.
కాగా.. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23న విజయవంతంగా జాబిల్లి దక్షిణధృవంపై దిగింది. అక్కడి నుంచి కీలక సమాచారం కూడా అందించింది. అయితే చంద్రుడిపై రాత్రి సమయం కావడంతో.. సెప్టెంబర్ 2న రోవర్, 4న ల్యాండర్ ను నిద్రాణస్థితిలోకి పంపారు. అనంతరం 14 రోజుల తర్వాత సెప్టెంబర్ 22న అక్కడ మళ్లీ సూర్యోదయం కావడంతో.. శాస్త్రవేత్తలు వాటి బ్యాటరీలను ఫుల్ గా ఛార్జ్ చేసి.. మేల్కొలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి సఫలం అయ్యేలా కనిపించకపోవడంతో.. ఇస్రో మాజీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరి చంద్రయాన్-3పై కిరణ్ కుమార్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.