గోట్ నయా రికార్డ్.. హైప్ లేకున్నా.. బుకింగ్స్ ఫుల్

G.O.A.T MOVIE: హీరో విజయ్ దళపతి, మినాక్షి చౌదరి నటిస్తున్న G.O.A.T ఈ సెప్టెంబర్ 5వ తేదీన థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీపై మొదటి నుంచి ఎక్కడ కూడా పెద్దగా హైప్ లేకపోయిన విషయం అందరికీ తెలిసిందే.  కానీ, తాజాగా ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ ఏ రేంజ్ లో అయ్యాయే తెలిస్తే షాక్ అవుతారు.

G.O.A.T MOVIE: హీరో విజయ్ దళపతి, మినాక్షి చౌదరి నటిస్తున్న G.O.A.T ఈ సెప్టెంబర్ 5వ తేదీన థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీపై మొదటి నుంచి ఎక్కడ కూడా పెద్దగా హైప్ లేకపోయిన విషయం అందరికీ తెలిసిందే.  కానీ, తాజాగా ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ ఏ రేంజ్ లో అయ్యాయే తెలిస్తే షాక్ అవుతారు.

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా,  దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కనున్న తాజాగా చిత్రం ‘G.O.A.T’ ( గ్రేటెస్ట్ ఆఫ్ అఫ్ ఆల్ టైమ్ ). ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇదొక అవైటెడ్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ మూవీగా రూపొదించారు. కాగా, ఇప్పటికే  G.O.A.T  మూవీ నుంచి విడుదలైన  సాంగ్స్, టీజర్, ట్రైలర్ చూసిన విజయ్ అభిమానుల్లో భారీ హైప్ ను పెంచేశాయి. పైగా ఈ సినిమానే విజయ్ కెరీర్ లో చివరి సినిమా కావడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో చూద్దామానని విజయ్ ఫ్యాన్స్  తెగ వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా మరో రెండు రోజుల్లో అనగా సెప్టెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది. కానీ, మొదటి G.O.A.T  మూవీ విషయంలో విజయ్ ఫ్యాన్స్ కు తప్ప ఆడియాన్స్ లో పెద్దగా బజ్ లేకుండా ఉన్న ఈ మూవీకి తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ ఏ రేంజ్ లో అయ్యాయే తెలిస్తే షాక్ అవుతారు. మరీ ఆ వివారాలేంటో చూద్దాం.

హీరో విజయ్ దళపతి, మినాక్షి చౌదరి నటిస్తున్న G.O.A.T ఈ సెప్టెంబర్ 5వ తేదీన థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కానీ, ఈ మూవీపై మొదటి నుంచి ఎక్కడ కూడా పెద్దగా హైప్ లేకపోయిన విషయం అందరికీ తెలిసిందే.  అయితే తాజాగా ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.  ఇంక సినిమా విడుదలకు రెండు రోజులు సమయం ఉన్న ఈ మూవీ బుకింగ్స్ మాత్రం జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా G.O.A.T USA అడ్వాన్స్ బుకింగ్స్ చుస్తే షాక్ అవ్వాల్సిందే. ఎటువంటి హైప్ లేకున్నా నయా రికార్డుతో ఫుల్ అవుతున్నాయి. కాగా, ప్రస్తుతానికి G.O.A.T మూవీ  US బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్ షోస్ రూపంలో $470K వసూలు చేసి రికార్డు దిశగా దూసుకుపోతుంది. అయితే ఈ రికార్డు విజయ్ గత చిత్రం బీస్ట్ ను దాటేసిందనే చెప్పవచ్చు.

ఒక రకంగా చెప్పాలంటే విజయ్‌ లియో తర్వాత G.O.A.T రెండవ అతిపెద్ద ఓపెనింగ్ వచ్చిన సినిమాగా నిలవడం గమన్హారం. ఇదిలా ఉంటే.. మరోవైపు తమిళనాడులో కూడా, బుకింగ్‌లు వేరే లెవల్ లో ఉన్నాయి. అలాగే GOAT తమిళ బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ టాప్ 3 ఓపెనింగ్స్‌ను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను రూ. 23 కోట్లకు కొనుగోలు చేసారు మైత్రీ మూవీస్ నిర్మాతలు. విజయ్ గత సినిమాల రికార్డులను G.O.A.T బద్దలు కొడుతుందో లేదో మరి కొద్ది రోజుల్లో తేలుతుంది. ఇకపోతే విజయ్ GOAT  మూవీలోప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్‌, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 05న వ‌రల్డ్ వైడ్‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Show comments