Nidhan
Tumbbad Movie Re Release Collections: మరాఠీ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘తుంబాడ్’ ఇప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజ్ టైమ్‌లో ఫర్వాలేదనిపించిన ఈ చిత్రం.. రీ రిలీజ్లో మాత్రం చరిత్ర సృష్టించింది.
Tumbbad Movie Re Release Collections: మరాఠీ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘తుంబాడ్’ ఇప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజ్ టైమ్‌లో ఫర్వాలేదనిపించిన ఈ చిత్రం.. రీ రిలీజ్లో మాత్రం చరిత్ర సృష్టించింది.
Nidhan
ఓటీటీల పుణ్యమా అని మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు ఆదరణ దక్కుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో తీసే సినిమాల కోసం ఆడియెన్స్ ఎగబడుతున్నారు. థియేటర్లలో ఎలా నడిచింది? ఎంత వసూలు చేసింది? అనే దాంతో సంబంధం లేకుండా బాగుందా? లేదా? అనే దాన్ని బట్టి ఓటీటీల్లో చూసేస్తున్నారు ప్రేక్షకులు. అందుకే బిగ్ స్క్రీన్స్‌లో ఫెయిలైన కొన్ని మూవీస్ ఓటీటీల్లో సూపర్ హిట్ అవుతున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకొని ఓటీటీ సంస్థలకు దండిగా లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఇలాగే థియేటర్లో యావరేజ్‌గా నడిచి ఓటీటీలో హిట్ అయిన ఓ మూవీ.. ఇప్పుడు బిగ్ స్క్రీన్స్‌లో రీ రిలీజై సంచలనాలు సృష్టిస్తోంది. ఫస్ట్ టైమ్ సాధించిన దాని కంటే డబుల్ కలెక్షన్స్ రాబట్టి నెవర్ బిఫోర్ ఫీట్‌ను నమోదు చేసింది. అదే మరాఠీ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘తుంబాడ్’.
ఆరేళ్ల కింద వచ్చిన ‘తుంబాడ్’ చిత్రం అప్పట్లో యావరేజ్‌గా నడిచింది. అయితే ఓటీటీలో మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిలియన్ల వ్యూస్‌తో అందర్నీ సర్ప్రైజ్ చేసింది. అయితే ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండటంతో మూవీ మేకర్స్ ధైర్యం చేసి మళ్లీ విడుదల చేశారు. మోస్తరుగా ఆడినా చాలనుకున్నారు. సీరియస్ హారర్ ఫిల్మ్ కాబట్టి మూవీ లవర్స్ తప్ప జనరల్ ఆడియెన్స్ నుంచి అంతగా రెస్పాన్స్ ఉండదని భావించారు. కానీ వాళ్ల అంచనా తప్పింది. ఓటీటీ రిలీజ్ తర్వాత కల్ట్ ఫ్యాన్‌బేస్ ఏర్పర్చుకున్న ‘తుంబాడ్’.. రీ రిలీజ్లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. 2018లో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లో 3 కోట్ల 25 లక్షలు కలెక్ట్ చేయగా.. ఇప్పుడు రీ రిలీజ్లో తొలి వారంలో ఏకంగా 7 కోట్ల 34 లక్షలు రాబట్టి ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్‌ను కూడా షాక్‌కు గురిచేసింది.
రీ రిలీజ్లో మూడ్రోజుల్లో దాదాపు ఏడున్నర కోట్లు కలెక్ట్ చేసింది ‘తుంబాడ్’. బుకింగ్స్‌లోనూ ఈ మరాఠీ ఫిల్మ్ జోరు మామూలుగా లేదు. గత 24 గంటల్లో బుక్ మై షోలో ఏకంగా 90 వేల టికెట్స్ సేల్ అయ్యాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే దళపతి విజయ్ ‘ది గోట్’, టోవినో థామస్ ‘ఏఆర్ఎం’ తర్వాత ప్లేస్‌లో ‘తుంబాడ్’ నిలిచింది. టాలీవుడ్ లేటెస్ట్ హిట్ మూవీ ‘మత్తు వదలరా 2’ నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం. ‘తుంబాడ్’ను ఆడియెన్స్ ఇంతగా ఆదరించడానికి, ఎగబడి చూడటానికి కారణం ఇది ఏ ఓటీటీలోనూ అందుబాటులో లేకపోవడమేనని తెలుస్తోంది. కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు తెచ్చుకోవడం, అగ్రిమెంట్ ముగిసిపోవడంతో అమెజాన్ ప్రైమ్ నుంచి తీసేయడం, అప్పట్లో థియేటర్లో మిస్ అయిన వారు ఆ ఎక్స్‌పీరియెన్స్‌ను కోరుకుంటుండటం ‘తుంబాడ్’ భారీ వసూళ్లకు రీజన్ అని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. మరి.. ‘తుంబాడ్’ మూవీని మీరు చూశారా? సినిమా మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.