నటి ఐశ్వర్య ఇష్యూలో బిగ్ ట్విస్ట్.. 16 రోజులకే భర్త టార్చర్ అంటూ..!

ప్రముఖ టెలివిజన్ నటి అడ్డాల ఐశ్వర్య ఇష్యూలో బిగ్ ట్విస్ట్. ఈ వివాదానికి సంబంధించి ఐశ్వర్య తాజాగా సంచలన విషయాలను బయటపెట్టారు.

ప్రముఖ టెలివిజన్ నటి అడ్డాల ఐశ్వర్య ఇష్యూలో బిగ్ ట్విస్ట్. ఈ వివాదానికి సంబంధించి ఐశ్వర్య తాజాగా సంచలన విషయాలను బయటపెట్టారు.

ప్రముఖ టెలివిజన్ నటి అడ్డాల ఐశ్వర్య ఇష్యూ గురించి తెలిసిందే. ఆమె మీద భర్త శ్యామ్ కుమార్ కంప్లయింట్ చేయడంతో కాంట్రవర్సీ మొదలైంది. గతేడాది సెప్టెంబర్ నెలలో తమకు మ్యారేజ్ అయ్యిందని, ఆమె తనకు మోసం చేసిందంటూ ఐశ్వర్య భర్త ఆరోపించారు. మేట్రిమోనిలో సంబంధం వచ్చిందని.. ఆమె సీరియల్​లో నటిస్తోందని, ఎలాంటి చెడు అలవాట్లు లేవని ఆమె పేరెంట్స్ చెప్పడంతో గతేడాది సెప్లెంబర్​లో పెళ్లి జరిగిందని తెలిపారు. కట్నం తీసుకోకుండానే ఐశ్వర్యను వివాహం చేసుకున్నానని పేర్కొన్నారు. పెళ్లయిన కొన్ని రోజులకే ఆమె చెడు అలవాట్లు, రియల్టర్ కరణం రమేష్ బాబుతో అక్రమ సంబంధం బయటపడిందని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఈ ఇష్యూలో ఐశ్వర్య సంచలన విషయాలు వెల్లడించారు. పెళ్లయిన 16 రోజులకే తన భర్త టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడని అన్నారు.

పెళ్లయిన 16 రోజులకే భర్త శ్యామ్ కుమార్ నరకం చూపించాడని అడ్డాల ఐశ్వర్య తెలిపారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని.. దానికి అంతు లేదన్నారు. ఇప్పటికే నరకం చూపించాడని.. ఇంకా టార్చర్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య తన బాధల్ని చెప్పుకొచ్చారు. ఇదే ప్రోగ్రామ్​లో ఆమె భర్త శ్యామ్ కుమార్ కూడా జాయిన్ అయ్యారు. ఫోన్ కాల్ ద్వారా ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ షోలో ఐశ్వర్య-శ్యామ్ కుమార్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాదనకు దిగారు. శ్యామ్ తన మీద చాలా సార్లు చేయి చేసుకున్నాడని, తిట్టాడని.. బయటి వారికి ఇంట్లో వారికి మధ్య తేడా ఆయనకు తెలియదన్నారు ఐశ్వర్య. ఆయన తనను మోసం చేశాడన్నారు.

ఇంట్లో అందర్నీ శ్యామ్ తిడతాడని ఐశ్యర్య అన్నారు. తాను కొట్టేవాడ్ని అయితే ఆమె చేసే పనికి నిజంగా కొట్టాల్సిందన్నారు శ్యామ్. ఐశ్వర్య మంచి నటి అని.. సీరియల్స్​లో యాక్టింగ్ ఇప్పుడు తన ముందు చేస్తోందన్నారు. వీళ్ల మధ్య వాదనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇష్యూ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక, ఐశ్వర్య సీరియల్స్​తో పాటు పలు సినిమాల్లోనూ నటించారు. ‘త్రిముఖి’, ‘ఈ సినిమా సూపర్​హిట్’ వంటి మూవీస్​లో యాక్ట్ చేశారు. ప్రస్తుతం బుల్లితెర మీద ఆమె ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ‘అమ్మాయి గారు’, ‘పలుకే బంగారమాయెనా’, ‘అల వైకుంఠపురం’ సీరియల్స్​లో నటిస్తున్నారు. మరి.. ఐశ్వర్య-శ్యామ్ ఇష్యూ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Taapsee Pannu: హీరోయిన్స్ నైట్ పార్టీస్ కు వెళ్తేనే.. తాప్సి చెప్పిన చేదు నిజాలు!

Show comments