మనకి తెలిసి ఇండియాని ఊపేసిన సాంగ్. కానీ.., ఒక్క రూపాయి రాలేదు: నిర్మాత ఆవేదన

Enjoy Enjaami: ఈ మధ్య కాలంలో దాదాపు అందరు యూట్యూబ్ లో వీడియోస్ చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటున్నారు. అయితే, దాదాపు మూడేళ్ళ క్రితం సెన్సేషన్ క్రియేట్ చేసిన ఓ సాంగ్ కు మాత్రం వ్యూస్ తప్ప..మనీ రాలేదని నిర్మాత వాపోయారు.

Enjoy Enjaami: ఈ మధ్య కాలంలో దాదాపు అందరు యూట్యూబ్ లో వీడియోస్ చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటున్నారు. అయితే, దాదాపు మూడేళ్ళ క్రితం సెన్సేషన్ క్రియేట్ చేసిన ఓ సాంగ్ కు మాత్రం వ్యూస్ తప్ప..మనీ రాలేదని నిర్మాత వాపోయారు.

సాధారణంగా యూట్యూబ్ లో వీడియోస్ ద్వారా మనీ సంపాదించేవారు ఎంతో మంది ఉంటారు. ఒక్కోసారి మిళియన్స్ లో వ్యూస్ వెళ్తే వారికి ప్రత్యేకమైన బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే . అయితే, ఈ క్రమంలో తాజాగా ఓ ప్రముఖ సాంగ్స్ ఆల్బమ్ నిర్మాత .. తనకు మనీ రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు మూడేళ్ల క్రితం సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆల్బమ్ “ఎంజాయ్ ఎంజామి”. ఈ ఆల్బమ్ ను గాయని ఢీ, తమిళ ర్యాపర్ అరివు రూపొందించారు. కాగా, ఈ ఆల్బమ్ కు సంతోష్ నారాయణన్ నిర్మాతగా వ్యవహరించారు. ఆ సమయంలో ఈ ఆల్బమ్ చాట్ బస్టర్ గా నిలిచింది. అయితే, తాజాగా ఈ నిర్మాత మరో వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాట వలన తాము ఏ మాత్రం ప్రయోజనం పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

“ఎంజాయ్ ఎంజామి” ఆల్బమ్ అప్పట్లో బాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఈ ఆల్బమ్ విడుదలయ్యి మూడేళ్లు అయిన సంధర్బంగా .. ఈ ఆల్బమ్ నిర్మాత తాజాగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఆ సాంగ్ అయితే కోట్లలో వ్యూస్ దక్కించుకుంది కానీ.. దాని వలన వారికీ ఏ మాత్రం ప్రయోజనం లేదని వాపోయారు. “ఎంజాయ్ ఎంజామి ని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దీనికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. బిలియన్లలో స్ట్రీమింగ్స్ అందుకుంది. అయితే,ఎం దీనివలన మేము ఎంత డబ్బు సంపాదించామో చెప్పాలనుకుంటున్నా. సున్నా .. నిజం, మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. ఈ విషయంపై పాటను విడుదల చేసిన మజ్జా లేబుల్ ను సంప్రదించాలని ఎన్నోసార్లు ప్రయత్నించాం. దురదృష్టవశాత్తు ప్రయోజనం లేకుండా పోయింది. ఆ లేబుల్ మాత్రం భారీ మొత్తంలో రెవిన్యూ అందుకుంది.” అంటూ ఆరోపణలు చేశారు. దీనితో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయంశంగా మారాయి.

కాగా, గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిందని చెప్పి తీరాలి. దాదాపు అందరు స్మార్ట్ ఫోన్స్ ను వినియోగిస్తున్నారు. అలానే , ఎవరికీ వారు యూట్యూబ్ ఛానెల్స్ ను క్రియేట్ చేసుకుని..వీడియోస్ పోస్ట్ చేస్తూ దాని ద్వారా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు. ఆ వీడియోస్ కాస్త ఇంట్రెస్టింగ్ ఉంటె చాలు .. క్షణాల్లో అవి వైరల్ అవ్వడం , ట్రెండ్ అవ్వడం కామన్ అయిపోయింది. ఈ క్రమంలో అందరికి వారి వారి వ్యూస్ కు తగినట్టు మనీ జెనెరేట్ అవుతున్నాయా లేదా అనేది మాత్రం కేవలం ఛానెల్స్ ను హ్యాండిల్ చేసేవారికి మాత్రమే తెలుస్తుంది. మరి, ఎప్పుడో మూడేళ్ల క్రిందట సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆల్బమ్ గురించి ఇప్పుడు ఆ ఆల్బమ్ నిర్మాత వ్యాఖ్యానించిన తీరుపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments