Rashmika Mandanna: భయపెట్టేందుకు రెడీ అవుతున్న నేషనల్ క్రష్! ఆ హర్రర్ మూవీలో..

Rashmika Mandanna acting in horror movie: ఇన్నాళ్లు తన అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. తొలిసారి భయపెట్టడానికి సిద్ధం అవుతోంది. ఓ హర్రర్ మూవీతో మన ముందుకు రాబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Rashmika Mandanna acting in horror movie: ఇన్నాళ్లు తన అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. తొలిసారి భయపెట్టడానికి సిద్ధం అవుతోంది. ఓ హర్రర్ మూవీతో మన ముందుకు రాబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ గా కుర్రాళ్ల మనసులను దోచిన ఈ బ్యూటీ, వరుస సినిమాలతో జోరుమీదుంది. ఒకవైపు టాలీవుడ్ లో ఛాన్స్ లు కొట్టేస్తూనే, మరోవైపు బాలీవుడ్ లో రాణిస్తోంది. యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత రష్మికకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడికి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇన్నాళ్లు తన అందంతో మెస్మరైజ్ చేసిన ఈ చిన్నది.. త్వరలోనే ఆడియెన్స్ న భయపెట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అవును ఓ హర్రర్ మూవీలో రష్మిక నటించబోతోంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో హర్రర్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. కొద్దిగా నవ్వించి, మరికొద్దిగా భయపెడితే చాలు ప్రేక్షకులు వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు ఇటీవల వచ్చిన సినిమాలే నిదర్శనం. అజయ్ దేవ్ గన్ ‘సైతాన్’, ముంజ్యా లేటస్ట్ గా స్త్రీ 2 సినిమా ఏ రేంజ్ లో వసూళ్లను సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు ఇదే జానర్ లో ఓ మూవీ చేయబోతోంది రష్మిక. వాంపైర్స్ ఆఫ్ విజయనగర పేరుతో ఓ హర్రర్ డ్రామా తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి ఆదిత్య సర్పోద్తర్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయనగర చరిత్ర నేపథ్యంలో హంపీ చుట్టూ తిరిగే కథ ఇది.

14వ శతాబ్దాపు విజయనగర చరిత్రతో మెుదలుపెట్టి వర్తమానం దాకా విభిన్నమైన కాలాలకు సంబంధించిన స్టోరీని ఇందులో చూపించబోతున్నారు. రష్మిక విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందట. ఆయుష్మాణ్ ఖురానా హీరోగా కనిపించబోతున్న ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉంది. రష్మిక నటించిన పుష్ప 2, చావా ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. వీటితో పాటుగా శేఖర్ కమ్ముల-ధనుష్ కాంబోలో వస్తున్న ‘కుబేర’ చిత్రంలో కూడా నటిస్తోంది. రాహుల్ రవింద్రన్ డైరెక్షన్ లో ది గర్ల్ ఫ్రెండ్ ను కూడా ఈ ఏడాదే ప్లాన్ చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు అందంతో ఆకట్టుకున్న రష్మిక తొలిసారి ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అవుతోంది.

Show comments