Ram Charan: క్రేజీ న్యూస్.. RC 16 ఆ మల్ల యోధుడి కథేనా? ఇదే నిజమైతే బాక్సాఫీస్ రికార్డులు షేకే!

Ram Charan, Kodi Rammurthy Naidu, RC 16: ఆర్సీ 16 మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఓ మల్ల యోధుడి పాత్రలో చరణ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Ram Charan, Kodi Rammurthy Naidu, RC 16: ఆర్సీ 16 మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఓ మల్ల యోధుడి పాత్రలో చరణ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. RC16 అనే వర్కింగ్ టైటిల్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇక ఈ మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఆర్సీ 16 ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ మల్ల యోధుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. అతడు అత్యంత శక్తిమంతుడని అప్పట్లో పేరుంది. ఎదురుగా వచ్చే రెండు కార్లను తన చేతుల్తో ఆపేటంత పవర్ ఫుల్ యోధుడు అతడు. ఇదే గనక నిజం అయితే.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.

ఆర్సీ 16.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నారు. గ్రామీణ క్రీడా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఆర్సీ 16 మూవీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ప్రముఖ మల్ల యోధుడి జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఆ మల్ల యోధుడి పేరు కోడి రామ్మూర్తి నాయుడు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం అనే గ్రామంలో 1882 పుట్టిన రామ్మూర్తి నాయుడు కుస్తీ పోటీల్లో తిరుగులేని ఆటగాడిగా పేరొందాడు. ఇతడి గురించి ఆంధ్రా ప్రజలు కథలు, కథలుగా చెప్పుకొంటారు.

కోడి రామ్మూర్తి నాయుడు అప్పట్లోనే ఒళ్లుగగుర్పొడిచే విన్యాసాలు చేసేవాడని పేరేన్నికగన్నాడు. కుస్తీ పోటీల్లో అతడికి తిరుగులేదు. స్పీడ్ గా వచ్చే రెండు కార్లను ఒకేసారి తన రెండు చేతులతో ఆపేవాడని, ఆయన ఛాతిపై నాపరాళ్లను పెట్టుకుంటే.. వాటిపైనుంచి ఏనుగులు నడిచివెళ్లేవని కథలు కథలుగా ఆయన గురించి చెప్పుకునే వారు. అలాగే ఒంటిచేత్తో రైలు ఇంజన్ ను రామ్మూర్తి నాయుడు ఆపినట్లు చెబుతుంటారు. దీంతో పాటుగా బుల్ ఫైట్ లోనూ అతడు పాల్గొన్నట్లుగా చరిత్ర చెబుతోంది. కాగా.. ఈయన ఓ సర్కస్ కంపెనీని కూడా నడిపించాడట. మల్ల మార్తాండ, కలియుగ భీమ, వీర కంఠీవ లాంటి బిరుదులు రామ్మూర్తి నాయుడికి ఉన్నాయి. ఆర్సీ 16 రామ్మూర్తి నాయుడు జీవితం ఆధారంగా చేసుకుని తెరకెక్కించే విషయం నిజం అయితే.. ఏ రేంజ్ లో సినిమా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన చేసిన విన్యాసాల గురించి చెబితేనే ఒళ్లు గగుర్పొడుస్తున్నాయి. ఇక మూవీలో వీటిని రామ్ చరణ్ చేస్తుంటే.. గూస్ బంప్స్ రావడం పక్కా. అయితే పూర్తిగా ఆయన జీవితాన్నే తెరకెక్కిస్తున్నారా? లేక.. హీరో పాత్ర కోసమే ఆయన లైఫ్ ను ఆధారంగా తీసుకున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీలో పాత్ర కోసం బాడీని బిల్డ్ చేయడానికి రామ్ చరణ్ ఆస్ట్రేలియా వెళ్లినట్లు తెలుస్తోంది. దాంతో ఈ చిత్రం నిజంగానే మల్ల యోధుడి కథే అని కొందరు ఫిక్స్ అవుతున్నారు.

Show comments