పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పవర్ ఫుల్ ట్రీట్.. వరుస అప్డేట్స్ ఇవే

Pawan Kalyan Movie Updates: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంపౌండ్ నుంచి బిగ్ అప్డేట్స్ వస్తున్నాయి. దింతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సిల్వర్ స్క్రీన్ పై పవన్ మ్యానియాను మిస్ అవుతున్నారు. ఈ క్రమంలో మరో రెండు సినిమాల షూటింగ్స్ లో బిజీ అయ్యారు.

Pawan Kalyan Movie Updates: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంపౌండ్ నుంచి బిగ్ అప్డేట్స్ వస్తున్నాయి. దింతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సిల్వర్ స్క్రీన్ పై పవన్ మ్యానియాను మిస్ అవుతున్నారు. ఈ క్రమంలో మరో రెండు సినిమాల షూటింగ్స్ లో బిజీ అయ్యారు.

గత కొంత కాలంగా పవర్ స్టార్ అభిమానులు సిల్వర్ స్క్రీన్ పై పవన్ ను మిస్ అవుతున్నారు. దీనితో పవన్ కళ్యాణ్ నుంచి ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్ కాంపౌండ్ నుంచి బిగ్ అప్డేట్స్ వస్తున్నాయి. ఈ అప్డేట్స్ చూడబోతుంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పవర్ ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఉన్నారు. దీనితో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఆల్రెడీ హరి హర వీరమల్లు షూటింగ్ పనులు మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫిల్మ్ సిటీలో ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఈ షూట్స్ తో బిజీగా ఉన్నారు. కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఆ గ్యాప్ ను ఫిల్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు.

అందుకే హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఇక ఆ తర్వాత ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఓజి మూవీ రెడీ గా ఉంది. ఈ సినిమా షూటింగ్ ను కూడా రీస్టార్ట్ చేశారు మేకర్స్. నిర్మాతల కోరిక మేరకు వారికీ కొన్ని డేట్స్ ఇచ్చారు పవన్. ఇక దాని ప్రకారంగానే ఓజి చిత్ర బృందం కూడా కొత్త షెడ్యూల్ ను రెడీ చేస్తుంది. దానికోసం ఆల్రెడీ ఫిల్మ్ సిటీ లో సెట్స్ కూడా వేసినట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేని షూట్స్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారట టీం. హరి హర వీరమల్లు షూటింగ్ తో పాటు.. ఓజి సెట్స్ లో కూడా మరో రెండు రోజుల్లో పవన్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నుంచి ఓ సినిమా వచ్చి చాలా కాలం అయింది కాబట్టి.. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు . వచ్చే ఏడాది ఎలా అయినా హరిహార వీరమల్లు , ఓజి సినిమాలను రిలీజ్ చేసేందుకు గట్టిగానే ఫిక్స్ అయ్యారు. సో త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.

ఇక ఈ రెండు సినిమాలు ఇలా ఉంటే.. పవన్ కళ్యాణ్ కోసం మరో సినిమా ఎదురుచూస్తుంది. అదే ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమే అయింది. కానీ ఇప్పటివరకు ఆ సినిమా ఊసే లేకుండా పోయింది. హరీష్ శంకర్ పవన్ కాంబినేషన్ లో ఈ సినిమా అనౌన్స్ చేయగానే భారీ అంచనాలు మొదలయ్యాయి. కానీ ఇప్పుడు హరీష్ తీసిన మిస్టర్ బచ్చన్ సినిమా బోల్తా కొట్టడంతో కొత్త సందేహాలు తలెత్తుతున్నాయి. అసలు ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందా ? లేదా పక్కన పెట్టేస్తారా ? అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఎలాగూ ప్రస్తుతం పవన్ మళ్ళీ షూట్స్ లో పాల్గొంటున్నాడు కాబట్టి .. ఎక్కడో కాస్తో కూస్తో ఈ సినిమాపై ఆశలు చిగురించాయి . ఇక దీనిపై చిత్ర బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments