బాక్సాఫీస్ వద్ద అక్టోబర్ సందడి ముగిసింది.. ఈ నెలలో అంచనాలతో వచ్చిన సినిమాలతో పాటు ఎలాంటి బజ్ లేకుండా వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. మరి థియేట్రికల్ గా అక్టోబర్ రిపోర్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం!
బాక్సాఫీస్ వద్ద అక్టోబర్ సందడి ముగిసింది.. ఈ నెలలో అంచనాలతో వచ్చిన సినిమాలతో పాటు ఎలాంటి బజ్ లేకుండా వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. మరి థియేట్రికల్ గా అక్టోబర్ రిపోర్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం!
అక్టోబర్ నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ ఎక్కువగా ప్లాప్ లను చవిచూసింది. తెలిసిన సినిమాలకంటే.. కనీసం పేరు కూడా తెలియని సినిమాలు ఎలాంటి బజ్ లేకుండా థియేటర్స్ లోకి వచ్చేశాయి. కొన్ని సినిమాలకు పేర్లు తెలిస్తే అందులో నటులు తెలియదు. మొత్తానికి అక్టోబర్.. ప్రతీ వారం చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయనే హడావిడి తప్ప.. హిట్స్ ఇంపాక్ట్ పెద్దగా లేదు. మొదటి వారంలో చూసుకుంటే.. దాదాపు పది సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో తెలిసిన ముఖాలతో వచ్చిన సినిమాలు రూల్స్ రంజన్, మంత్ ఆఫ్ మధు, మామా మశ్చింద్ర, మ్యాడ్, సిద్ధార్థ్ హీరోగా వచ్చిన చిన్నా. ఈ ఐదు సినిమాలలో బజ్ తో పాటు సక్సెస్ అయ్యింది మ్యాడ్ ఒక్కటే. సిద్ధార్థ్ చిన్నా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
రెండో శుక్రవారం విషయానికి వస్తే.. నాతోనే నేను, రాక్షస కావ్యం, తంతిరం, నయనతార నటించిన గాడ్ సినిమాలు వచ్చాయి. కనీసం ఈ సినిమాలు ఉన్నాయని రిలీజ్ రోజు వరకు ప్రేక్షకులకు సరిగ్గా తెలియదు. అలా వచ్చేసాయి. పోటీకి పెద్ద సినిమాలు లేకుండా మంచి అవకాశం దొరికినప్పటికి.. ఏ ఒక్కటీ క్లిక్ అవ్వలేదు. ఎలా వచ్చాయో అలాగే వెళ్లిపోయాయి. మూడో వారంలో బాక్సాఫీస్ వద్ద కాస్త సందడి కనిపించింది. దళపతి విజయ్ లియో, బాలకృష్ణ భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు మంచి బజ్ తో విడుదల అయ్యాయి. మళ్ళీ వీటిలో లియోకి, టైగర్ నాగేశ్వరరావుకు ఫస్ట్ డేనే నెగిటివ్ టాక్ వచ్చాయి. అయినా సరే.. ఎలాగోలా లియో మెల్లగా క్లిక్ అయిపోయింది. కలెక్షన్స్ కూడా గట్టిగా రాబడుతోంది.
మూడో వారం డైరెక్ట్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా భగవంత్ కేసరి. బాలకృష్ణకి ఈ సినిమా వరుసగా రూ. 100 కోట్లు కలెక్ట్ చేసిన మూడో సినిమా కావడంతో హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. ఇక టైగర్ నాగేశ్వరరావు మాత్రం నెగిటివ్ టాక్ తాకిడి నుండి కోలుకునేందుకు కష్టపడుతుంది. నాలుగో వారానికి వస్తే.. పేరున్న సినిమాలు రాలేదు. కేవలం సంపూర్ణేశ్ బాబు నటించిన ‘మార్టిన్ లూథర్ కింగ్’ కాస్త బజ్ తో వచ్చింది. అయినప్పటికీ.. సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపలేకపోయింది. ఆ విధంగా అక్టోబర్ బాక్సాఫీస్ లెక్కల ప్రకారం.. మ్యాడ్, లియో, భగవంత్ కేసరి సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అందుకున్నాయి. మరి మీ ఉద్దేశంలో ఏవైనా సినిమాలు మిస్ అయ్యాయా కామెంట్స్ లో తెలపండి.