Krishna Kowshik
Nayanthara.. ఈ మధ్య కాలంలో హీరోయిన్లు వివాదాల పాలు అవుతున్నారు. సినిమాల పరంగా కాకుండా ఆరోగ్య సూచనలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్న సమంత.. ఇప్పడు నయన తార. ఇంతకు ఏమైందంటే..?
Nayanthara.. ఈ మధ్య కాలంలో హీరోయిన్లు వివాదాల పాలు అవుతున్నారు. సినిమాల పరంగా కాకుండా ఆరోగ్య సూచనలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్న సమంత.. ఇప్పడు నయన తార. ఇంతకు ఏమైందంటే..?
Krishna Kowshik
ఈ మధ్య కాలంలో వివాదాల్లో చిక్కుకుంటున్నారు స్టార్ బ్యూటీలు. సినిమాల పరంగా కాదు.. హెల్త్‌కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తెలుగు సూపర్ స్టార్ సమంత గతంలో ఓ పాడ్ కాస్ట్‌లో ఆరోగ్యంపై సూచనలు చేయడంతో విమర్శలపాలయ్యింది. ఆ తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో నెబిలేజ్ చేస్తే మంచి ఫలితాలున్నాయని చెప్పగా.. ఓ పెద్ద చర్చే నడిచింది. ఆమె మాటలు వింటే డైరెక్ట్ చావే అంటూ ఓ డాక్టర్ విమర్శించడం.. తిరిగి బదులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరింది లేడీ సూపర్ స్టార్ నయన తార. మందార పువ్వుతో చేసిన టీ వల్ల అనేక ప్రయోజనాలున్నాయి ఆమె ఓపోస్టు పెట్టడంతో నెట్టింట చర్చకు దారి తీసింది. అయితే దీన్ని కూడా రచ్చ చేశారు.
ఈ ఏడాదే ఇన్ స్టా ఖాతాను తెరచిన నయన్.. అప్పటి నుండి యాక్టివ్‌గా ఉంటుంది. తన అభిప్రాయాలను షేర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో మందారపువ్వులతో చేసే టీ గురించి ఓ పోస్టు పెట్టింది. ఆ టీ తనకెంతో ఇష్టమని, దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిపింది. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని.. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంది. దీనిపై ఓ వైద్యుడు స్పందిచాడు. 8.7 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను ఆమె తప్పుదోవ పట్టిస్తుందని ది లివర్ డాక్టర్ అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. ఆమె మాటల్లో నిజం లేదని పేర్కొన్నాడు. ఆయన ట్వీట్ వైరల్‌గా మారడంతో పాటు విమర్శలు రావడంతో ఆమె వెంటనే ఆ పోస్టును తొలగించింది.
ఆమె తాజాగా ఇన్‌స్టాలో ఆసక్తికర సందేశాన్ని పంచుకుంది. ‘తెలివి తక్కువ వారితో వాదించవద్దు. ఆ విధంగా మిమ్మల్ని వారి స్థాయికి తీసుకువెళ్లి, ఓడిస్తారు’ అని అమెరికన్ రైటర్ మార్క్ ట్వైన్ సూక్తిని షేర్ చేసింది నయన్. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. తనని విమర్శించిన వారిని కౌంటరిచ్చేందుకు ఇలా చేసిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ లేడీ సూపర్ స్టార్ చేతిలో 11 సినిమాలు ఉన్నాయి. టెస్ట్, మన్నాంగట్టి సిన్స్ 1960, డియర్ స్టూడెంట్స్, తనిఒరువన్ 2, గుడ్ బాడ్ అగ్లీ, టాక్సీస్, ముక్తి అమన్ 2, యునైటెడ్ సర్జన్ ఎఫ్ఎం ఫిల్మ్ కాకుండా మరి కొన్ని సినిమాలు చేతిలో ఉన్నాయి. గత ఏడాది జవాన్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నయన్.