జానీ మాస్టర్‌కు మరో దెబ్బ.. ఈ సారి పోలీసుల షాక్

Choreographer Jani Master: జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలింది. ఈ సారి నార్జింగి పోలీసులు షాక్ ఇచ్చారు. ఇప్పటికే నేషనల్ కొరియోగ్రాఫర్ అవార్డు రద్దుతో షాక్ లో ఉన్న జానీకి మరో దెబ్బ తగిలినట్లైంది.

Choreographer Jani Master: జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలింది. ఈ సారి నార్జింగి పోలీసులు షాక్ ఇచ్చారు. ఇప్పటికే నేషనల్ కొరియోగ్రాఫర్ అవార్డు రద్దుతో షాక్ లో ఉన్న జానీకి మరో దెబ్బ తగిలినట్లైంది.

ప్రముఖ కొరియేగ్రాఫర్ జానీ మస్టర్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తన ట్యాలెంట్ తో టాప్ పొజిషన్ కు చేరుకున్న జానీ అత్యాచార కేసులో చిక్కుకుని విలవిల్లాడుతున్నాడు. జానీ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసిన ఓ మహిళ తనపై జానీ అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మైనర్ గా ఉన్నప్పుడే అత్యాచారానికి ఒడిగట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ పై అత్యాచారం, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత జానీని అరెస్టు చేసి ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన కోర్టు జానీకి 14 రోజుల జ్యుడీషియల్ రిమండ్ విధించింది. దీంతో పోలీసులు అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇదిలా ఉంటే జానీ మాస్టర్ నేషనల్ కొరియోగ్రాఫర్ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. 2022లో తిరుచిత్రబలం చిత్రానికిగాను జాని మాస్టర్‌కు ఉత్తమ కొరియోగ్రాఫర్‌ అవార్డును కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డుల వేడుక ఈ నెల 8న జరుగనున్నది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ ఈ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరవ్వడానికి బెయిల్ ఇవ్వాలని కోర్టును విజ్ఞప్తి చేశాడు. దీనికి అంగీకరించిన కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. ఆయనకు ఈ నెల 6 నుంచి 9 వరకు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. అయితే తాత్కాళిక బెయిల్ పై విడుదలైన జానీకి ఊహించని షాక్ తగిలింది. నేషనల్ కొరియోగ్రాఫర్ అవార్డును తాత్కాళికంగా రద్దు చేస్తున్నట్లు జాతీయ అవార్డుల కమిటీ ప్రకటించింది.

జానీపై పోక్సో చట్టం కింద వచ్చిన తీవ్ర ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అలాగే ఈ నెల 8న న్యూఢిల్లీలో జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం కోసం ఆయనకు పంపిన ఆహ్వానాన్ని కూడా ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. దీంతో జానీ జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును అందుకునే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ షాక్ లో ఉన్న జానీకి నార్సింగి పోలీసులు మరో షాక్ ఇచ్చారు. జానీ మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు కోర్టును ఆశ్రయించారు.

అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కావడానికి జానీకి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సిటీ కోర్టును పోలీసులు కోరారు. దీంతో జానీ మళ్లీ రిమాండ్ కు వెళ్లే అవకాశం ఉంది. అయితే జానీ మాస్టర్ కు జాతీయ అవార్డును రద్దు చేయడంపై పలువరు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదకగా స్పందిస్తున్నారు. అవార్డు క్యాన్సిల్ చేయడం సరికాదని పోస్టులు పెడుతూ జానీకి మద్దుతుగా నిలుస్తున్నారు. మరి జానీ మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు కోర్టును ఆశ్రయించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments