10 Runs All Out: టీ20 క్రికెట్ లో పెను సంచలనం.. 10 పరుగులకే ఆలౌట్!

10 Runs All Out, Mongolia vs Singapore: టీ20 క్రికెట్ లో పెను సంచలనం నమోదు అయ్యింది. 10 ఓవర్లు ఆడి కేవలం 10 రన్స్ మాత్రమే చేసి.. 10 వికెట్లు కోల్పోయింది ఓ జట్టు. ఆ వివరాల్లోకి వెళితే..

10 Runs All Out, Mongolia vs Singapore: టీ20 క్రికెట్ లో పెను సంచలనం నమోదు అయ్యింది. 10 ఓవర్లు ఆడి కేవలం 10 రన్స్ మాత్రమే చేసి.. 10 వికెట్లు కోల్పోయింది ఓ జట్టు. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రపంచ క్రికెట్ లో ఏదో ఒక మూల.. ఏదో ఒక రికార్డు నమోదు అవుతూనే ఉంటుంది. కొన్ని సార్లు ఆ రికార్డులు చూసి.. క్రికెట్ లవర్స్ నోరెళ్లబెట్టాల్సి వస్తుంది. తాజాగా అలాంటి రికార్డే ఒకటి టీ20 క్రికెట్ లో క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2024 ఏసియా క్వాలిఫయర్-ఏ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా లేటెస్ట్ గా జరిగిన పోరులో సింగపూర్ టీమ్ తన ప్రత్యర్థిని 10 పరుగులకే ఆలౌట్ చేసి సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం.

టీ20 క్రికెట్ లో పెను సంచలనం నమోదు అయ్యింది. టీ20 వరల్డ్ కప్ 2024 ఏసియా క్వాలిఫయర్ -ఏ లో భాగంగా సింగపూర్ వర్సెస్ మంగోలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సింగపూర్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మంగోలియా జట్టును కేవలం 10 రన్స్ కే ఆలౌట్ చేసింది. 10 ఓవర్లు ఆడిన మంగోలియా 10 రన్సే చేసింది. జట్టులో ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కాగా.. మరో నలుగురు కేవలం ఒక రన్ కే వెనుదిరిగారు. మిగిలిన ఇద్దరు చెరో 2 రన్స్ తో టాప్ స్కోరర్లుగా నిలిచారు. సింగపూర్  బౌలర్లలో హర్ష భరద్వాజ్ 6 వికెట్లతో చెలరేగాడు. అనంతరం 10 పరుగుల సింపుల్ టార్గెట్ ను 5 బంతుల్లో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది సింగపూర్. మరి టీ20 క్రికెట్ లో ఈ మ్యాచ్ సరికొత్త చరిత్రను లిఖించినట్లుగా అయ్యింది. మరి ఈ సంచలన మ్యాచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments