Swetha
Khaleja Re Release: అదేంటో తెలియదు కానీ అప్పట్లో ప్రేక్షకులే బాలేదని ప్లాప్ చేసిన సినిమాలను .. ఇప్పుడు ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేస్తే వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. అప్పట్లో థియేటర్స్ లో ప్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాల్లో ఖలేజా కూడా ఒకటి. ఇక ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్ ట్రెండ్ లో భాగం అయింది. మే 30 న ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నారు మేకర్స్ . దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ మతి పోగెట్టేలా ఉన్నాయట.
Khaleja Re Release: అదేంటో తెలియదు కానీ అప్పట్లో ప్రేక్షకులే బాలేదని ప్లాప్ చేసిన సినిమాలను .. ఇప్పుడు ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేస్తే వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. అప్పట్లో థియేటర్స్ లో ప్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాల్లో ఖలేజా కూడా ఒకటి. ఇక ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్ ట్రెండ్ లో భాగం అయింది. మే 30 న ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నారు మేకర్స్ . దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ మతి పోగెట్టేలా ఉన్నాయట.
Swetha
ఈ మధ్య కాలంలో రీరిలీజ్ లకు వచ్చే రెస్పాన్స్ అంతా ఇంత కాదు. ప్రస్తుతం వర్షం సినిమా రీరిలీజ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తుంది . ఈ సినిమా రీరిలీజ్ చేయడం మొదటి సారి కాకపోయినా సరే..డార్లింగ్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. అదేంటో తెలియదు కానీ అప్పట్లో ప్రేక్షకులే బాలేదని ప్లాప్ చేసిన సినిమాలను .. ఇప్పుడు ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. అప్పట్లో థియేటర్స్ లో ప్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాల్లో ఖలేజా కూడా ఒకటి. ఇక ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్ ట్రెండ్ లో భాగం అయింది. మే 30 న ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నారు మేకర్స్ . దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ మతి పోగెట్టేలా ఉన్నాయట.
వారం రోజులు ముందుగానే బుక్ మై షోలో టికెట్స్ పెట్టేసారు. సినిమాకు గంటకు 14 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయట. ఇలా అమ్ముడుపోవడం టాలీవుడ్ రీరిలీజ్ హిస్టరీలోనే మొదటి సారి అని అంటున్నారు. స్ట్రెయిట్ సినిమాలు , పాన్ ఇండియా సినిమాలకు కూడా కొన్నిసార్లు ఇలాంటి క్రేజ్ ఉండదట. దీనితో ఈ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి.. మరిన్ని షోస్ యాడ్ చేయనున్నారు ఎగ్జిబిటర్లు. వారం ముందే ఇలా ఉంటె ఇక థియేటర్స్ లో రిలీజ్ రోజున ఎలా ఉంటుందో.. అసలే ఫ్యాన్స్ ఈ మధ్య సినిమాలలోని ఐకానిక్ సీన్స్ లో థియేటర్స్ రిక్రియెట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఎలాంటి సీన్స్ రిక్రియేట్ చేస్తారో ఏమో.
అయితే ఖలేజా సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ ఉండడం వెనుక చాలానే రీజన్స్ ఉన్నాయి. ఒరిజినల్ గా రిలీజ్ అయినా సమయంలో కమర్షియల్ గా ఈ సినిమా ఫెయిల్ అయింది. పైగా త్రివిక్రం, మహేష్ కాంబినేషన్ మీద అంచనాలు ఎక్కువ పెట్టుకోవడంతో.. ప్లాప్ అనిపించుకుంది. నిజానికి అవేమి మైండ్ లో పెట్టుకోకుండా చూస్తే మాత్రం ఈ సినిమా అవుట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ గానే అనిపిస్తుంది. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత ఈ సినిమాకు కల్ట్ స్టేటస్ రావడం మొదలైంది.
పైగా చాలా కాలం వరకు ఈ సినిమా శాటిలైట్ రిలీజ్ కు కూడా నోచుకోలేదు. అప్పట్లో OTT రిలీజ్ లు కూడా చాలా తక్కువ. సో చాలా మంది ఈ సినిమాను లైట్ తీసుకున్నారు. కానీ వన్స్ టెలివిజన్స్ లో రిలీజ్ అయ్యాక ఈ సినిమాను అందలం ఎక్కించేసారు. అలాంటిది ఇప్పుడు ఇన్నాళ్లకు మరోసారి ఇది బిగ్ స్క్రీన్ మీద రిలీజ్ అవుతుంటే చూడకుండా ఎవరు ఆగుతారు. పైగా మళ్ళీ బాబుని వెండితెరపై చూడడానికి చాలా సమయం పడుతుంది.. జక్కన్న ప్రాజెక్ట్ అంటే ఆ మాత్రం వెయిటింగ్ తప్పదు కదా. ఇలా అన్ని కలుపుకుని ఇప్పుడు ఖలేజా సినిమాకు క్రేజి ఫాలోయింగ్ వచ్చేస్తుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.