Nidhan
Japan: జపాన్ను భూకంపాలు భయపెడుతున్నాయి. ప్రకృతి విపత్తు అక్కడి ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ అన్న సేఫ్ అని అంటున్నారు.
Japan: జపాన్ను భూకంపాలు భయపెడుతున్నాయి. ప్రకృతి విపత్తు అక్కడి ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ అన్న సేఫ్ అని అంటున్నారు.
Nidhan
ప్రకృతి విలయాలు మిగిల్చే నష్టం అంతా ఇంతా కాదు. వీటి వల్ల భారీ మొత్తంలో ధన, ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుంది. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి. ప్రకృతి విలయాలు చేసిన నష్టాన్ని పూడ్చలేం. దాని నుంచి మళ్లీ సాధారణ స్థితికి జీవనం చేరుకోవాలంటే చాలా టైమ్ పడుతుంది. ఇప్పుడు జపాన్ ఇదే సిచ్యువేషన్‌ను ఫేస్ చేస్తోంది. అక్కడ భూకంపాలు, సునామీలు సర్వసాధారణమే. కానీ ఈసారి భూకంపం సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. జపాన్‌లో సంభవించిన భూకంపంలో కీలక విషయాలు మెళ్లిగా బయటపడుతున్నాయి. ఒక్క సోమవారం నాడే ఆ దేశంలో తీవ్రమైన 155 ప్రకంపనలు వచ్చినట్లు గుర్తించారు. రిక్టర్ స్కేలు మీద వీటి తీవ్రత 3 నుంచి 7.6 మధ్యలో నమోదైంది. ఈ తరుణంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ అన్న సేఫ్ అంటున్నారు. అసలు జపాన్ భూకంపానికి, తారక్ ఫ్యాన్స్ కామెంట్స్‌కు ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం..
జపాన్ భూకంపం బారి నుంచి టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తప్పించుకున్నారు. ఆయన గత వారం రోజులుగా ఆ దేశంలోనే ఉన్నారు. స్వయంగా ఈ విషయాన్ని తారక్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ విపత్తు వల్ల ఎఫెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఎన్టీఆర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. జపాన్ ప్రజల ధైర్యానికి ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఆ దేశం నుంచి ఇవాళే ఇంటికి తిరిగి వచ్చానన్నారు. జపాన్‌లో భూకంపం సంభవించిందనే వార్త విని షాకయ్యానని చెప్పారు. అక్కడి ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్నానని.. వాళ్లు ఈ విపత్తు నుంచి వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్లో రాసుకొచ్చారు తారక్. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన ఆయన అభిమానులు తమ అన్న సేఫ్ అంటున్నారు.
జపాన్ భూకంపం బారి నుంచి ఎన్టీఆర్ తప్పించుకోవడంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ‘మా అన్న సేఫ్.. ఆయనకు ఏమీ కాదు’ అని సోషల్ మీడియాలో తారక్ అభిమానులు ట్వీట్స్ పెడుతున్నారు. దేవుడి దయ వల్ల ఆయన సేఫ్‌గా ఇండియాకు తిరిగి వచ్చారని అంటున్నారు. అదే టైమ్‌లో జపాన్ ప్రజలు త్వరగా కోలుకోవాలని.. వాళ్లు క్షేమంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఒకవైపు తమ ఫేవరెట్ హీరో క్షేమంగా తిరిగి వచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూనే.. మరోవైపు భూకంప బాధితులు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. దేవుడు వాళ్లను రక్షించాలని కోరుతున్నారు. ఇక, ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్.. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ‘దేవర’లో మరో హిందీ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా యాక్ట్ చేస్తున్నారు. మరి.. జపాన్ భూకంపంపై తారక్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: Teja Sajja: నేను సూపర్ స్టార్ మహేష్‌కు పోటీ ఏంటి?: తేజ సజ్జా
Back home today from Japan and deeply shocked by the earthquakes hitting. Spent the entire last week there, and my heart goes out to everyone affected.
Grateful for the resilience of the people and hoping for a swift recovery. Stay strong, Japan 🇯🇵— Jr NTR (@tarak9999) January 1, 2024
Terrible footage coming as the Earthquake hits Japan #Japan #JapanEarthquake #Tsunami pic.twitter.com/oECGJKoDJJ
— Yamaan Shahid (@realYamaan) January 2, 2024
Our thoughts and prayers go out to the people of Japan 🇯🇵
Exclusive Footage of baby taking cover as Japan’s 7.5 magnitude earthquake hits. Little cute baby❤️
📍 #Japan | #JapanEarthquake.
— MH Cricket (@MHCricketDaily) January 2, 2024