Swetha
ప్రస్తుతం తారక్ అభిమానులంతా దేవర మూవీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27న థియేటర్స్ దద్దరిల్లిపోడానికి రెడీగా ఉన్నాయి. అయితే దేవర పక్కా హిట్ కొట్టేస్తుందని అంతా అనుకుంటున్నారు. అంతే కాదు దేవర హిట్ అవ్వడానికి మెగా హీరోలు కూడా ఓ కారణం. ఆ వివరాలేంటో చూసేద్దాం .
ప్రస్తుతం తారక్ అభిమానులంతా దేవర మూవీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27న థియేటర్స్ దద్దరిల్లిపోడానికి రెడీగా ఉన్నాయి. అయితే దేవర పక్కా హిట్ కొట్టేస్తుందని అంతా అనుకుంటున్నారు. అంతే కాదు దేవర హిట్ అవ్వడానికి మెగా హీరోలు కూడా ఓ కారణం. ఆ వివరాలేంటో చూసేద్దాం .
Swetha
ఆరేళ్ళ తర్వాత తారక్ సోలో గా స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు కాబట్టి దేవర పక్కా హిట్ కొట్టేస్తుంది. ఎలాగూ ఇది తారక్ సినిమానే.. సాధారణంగానే ఈ హీరోకు అభిమానులు ఉంటారు. సో ఎలాగైనా హిట్ పక్కా. అని ఇలా రకరకాలుగా దేవర గురించి విపరీతమైన బజ్ నడుస్తుంది. పైగా ఇప్పుడు రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజులు సమయం మాత్రమే ఉండడంతో.. అభిమానులలో ఇంకాస్త క్యూరియాసిటీ పెరిగిపోయింది. సెప్టెంబర్ 27 థియేటర్స్ అన్ని మోత మోగిపోవడం ఖాయం. నిజమే అభిమానుల అంచనాలలో తప్పులేదు.. దేవర ఎలాగైనా హిట్ అవుతుంది. కానీ దేవర హిట్ అవ్వడం వెనుక మెగా హీరోల పాత్ర కూడా ఉంది. అదేలా అని అనుకుంటున్నారా.. మరి మెగా హీరోలకు , తారక్ సినిమాలకు ఉన్న లింక్ ఏంటో చూసేద్దాం.
తారక్ సినిమాలకు కు మెగా హీరోలకు ఉన్న లింక్ ఏంటో తెలియాలంటే ఒక్కసారి వెనక్కు వెళ్లాల్సిందే. 2017లో డైరెక్టర్ బాబీ- తారక్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా జై లవ కుశ. ఆ సమయంలో ఈ సినిమా గురించి విపరీతమైన బజ్ నడిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచింది. అయితే దీనికంటే ముందు బాబీ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ తీశాడు. ఈ సినిమా ఆడియన్సు ను అంతంత మాత్రంగానే అలరించింది. కానీ ఈ ప్లాప్ తర్వాత వచ్చిన జై లవకుశ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత 2018 లో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్- తారక్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ అరవింద సమేత. ఒక డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టాలన్న కసితోనే త్రివిక్రమ్ ఈ సినిమాను తీసాడా.. అన్న రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ తిరగరాసింది ఈ మూవీ. ఇంతకీ ఆ డిజాస్టర్ ఏంటంటే.. ఈ మూవీ కంటే ముందు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ మూవీ.. ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.
ఇక ఇప్పుడు దేవర మూవీ విషయానికొస్తే. ఈ సినిమా కంటే ముందు 2022 లో కొరటాల శివ- చిరంజీవి , రామ్ చరణ్ కాంబినేషన్ లో ఆచార్య మూవీ వచ్చింది. తండ్రి, కొడుకులు కలిసి నటించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తీరా రిలీజ్ తర్వాత చూస్తే మాత్రం.. ప్రేక్షకుల మాట అటు ఉంచితే.. అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోయింది ఈ మూవీ. ఈ లెక్కన చూస్తే ఇలా దర్శకుడి ప్రతి ప్లాప్ తర్వాత .. తారక్ వారికి తిరుగులేని సక్సెస్ ను అందిస్తున్నాడు. అలానే ఇదే లాజిక్ ను బట్టి చూస్తే.. ఇప్పుడు కొరటాల శివ-తారక్ కాంబో లో రిలీజ్ కు రెడీ గా ఉన్నదేవర.. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం ఖాయం. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే తారక్ సినిమాల హిట్స్ కు ముందు ప్లాప్ అయినా సినిమాలన్నీ మెగా హీరోలవే. ఓ రకంగా మెగా హీరోలే దేవరను కాపాడుతున్నారని చెప్పొచ్చు. కాబట్టి దేవర సినిమా కచ్చితంగా అభిమానులు ఊహించినట్లుగా.. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.