Salaar Movie: సలార్‌లో ప్రభాస్ క్యారెక్టర్‍కి ఆ డిజార్డర్ ఉందా? ఇది మరణ మాస్!

సలార్ సందడి మొదలైంది. రెండు ట్రైలర్లు, సింగిల్ సాంగ్ సినిమాపై మెంటల్ తెప్పిస్తోంది. డిసెంబర్ 22న థియేటర్లలో సినిమా చూడాలన్న యాంగ్జైటీ మరింత పెరిగిపోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే..

సలార్ సందడి మొదలైంది. రెండు ట్రైలర్లు, సింగిల్ సాంగ్ సినిమాపై మెంటల్ తెప్పిస్తోంది. డిసెంబర్ 22న థియేటర్లలో సినిమా చూడాలన్న యాంగ్జైటీ మరింత పెరిగిపోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే..

డార్లింగ్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ నరాలు తెగే ఉత్కంఠను అనుభవిస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. కటౌట్‌ ను ఎప్పుడు తెరపై చూస్తామా అని.. ఈ రి అతడి ఖాతాలో హిట్ పడుతుందా లేదా అన్న సందిగ్దతతో కూడిన టెన్షన్‌ లో ఉన్నారు. అయితే డిసెంబర్ 1న వచ్చిన ట్రైలర్ కానీ, ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ కానీ పిచ్చెక్కించాయి. ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. ఇక డిసెంబర్ 18న విడుదల చేసిన రెండో ట్రైలర్ వేరే లెవల్. సెకండ్ ట్రైలర్ నుండి ఊర మాస్ జాతర చూపించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక రెబల్ స్టార్.. బాక్సాఫీసును షేక్ ఆడించడం ఖాయమని అనుకుంటున్నారు.

అయితే ఈ మధ్య కాలంలో చాలా చిత్రాల్లో హీరోకో, హీరోయిన్లకో కచ్చితంగా ఓ డిజార్డర్, అంగవైకల్యమో లేదా రుగ్మత ఉంటుంది. సన్నాఫ్ సత్యమూర్తిలో సమంతకు షుగర్, రంగస్థలంలో రామ్ చరణ్‌ కు చెవిటి, భలే భలే మగాడివోయ్‌ లో నానికి మతిమరుపు, జై లవకుశలో జూనియర్ ఎన్టీఆర్‌ కు నత్తి, లైగర్‌ లో విజయ్ దేవరకొండకు కూడా నత్తి, అలాగే పుష్పలో అల్లు అర్జున్‌ కు గూనీ, మొన్న వచ్చి హిట్ అందుకున్న మంగళవారం మూవీలో పాయల్ రాజ్ పుత్ హెచ్ఎస్డీ డిజార్డర్‌ తో బాధపడుతూ ఉంటుంది. హీరోలకు, హీరోయిన్లు ఏదో ఒక డిజార్డర్ పెడుతూ హిట్లు అందుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు ఇదే సలార్ మూవీలో కూడా కనిపిస్తోంది.

ఇటీవల విడుదల చేసిన రెండు ట్రైలర్లను గమనిస్తే.. ప్రభాస్ కూడా ఏదో డిజార్డర్‌ తో బాధపడుతున్నట్లు అనిపించకమానదు. సలార్ తొలి ట్రైలర్‌ లో ‘ఎవడ్రా.. ఎవడు.. చెప్పరా ఎవడూ’ అంటూ చాలా సీరియస్‌ గా, పళ్లు కొరుకుతూ రూడ్‌ గా ప్రభాస్ చిన్నప్పటి (దేవా క్యారెక్టర్) పాత్రలో కనిపిస్తాడు ఓ పిల్లాడు. ‘నీ కోసం ఎర అయితా, సొర అయినా అవుతా’ అని చెప్పగానే.. వరద రాజ్ మన్నార్ (పృధ్వీ సుకుమారన్) పాత్రలోని పిల్లాడు దేవా కోపానికి గుటకలు మింగుతాడు. ఆ తర్వాత ఏమాత్రం ఆలోచించకుండా ఇష్టమొచ్చినట్లు నరుకుతూ కనిపిస్తాడు ప్రభాస్. ఫ్రెండ్ కోసం వెనుకా ముందు ఆలోచించకుడా చంపుతూ ఉంటాడు. ఇక చివర్లో నిన్ను ఎవ్వరూ ముట్టుకోకూడదు అని అరుస్తాడు ప్రభాస్.

ఇక సెకండ్ ట్రైలర్ కూడా చూస్తే.. మళ్లీ ప్రభాస్, పృధ్వీ చిన్నప్పటి పాత్రలు కనిపిస్తాయి. అందులో దేవా పాత్రలో కనిపించిన పిల్లాడు ఓ మేకును నోట్లో పెట్టుకుని, ఓ తలుపుకు ఉన్న మరికొన్ని మేకుల్ని టపాటపా అని కోపంతో కొడుతూ కనిపిస్తాడు. అలాగే ఓ యోధుడితో పోరాడుతుంటే ఏకంగా కరెంట్ వైర్‌నే పట్టేసుకుంటాడు. అలాగే ట్రైలర్ లో పృధ్వీ అడిగింది ఏదైనా తెచ్చి ఇస్తాడని చెప్పకనే చెప్పారు. కాన్సార్‌ లో కేలుక్యులేటర్ పెట్టుకుని ఏం లెక్కలు వేయలేమని.. లెక్క పెట్టలేని ఓ పిచ్చోడ్ని తీసుకు వచ్చా అంటూ ప్రభాస్‌ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు పృధ్వీ. వీటన్నింటి బట్టి చూస్తే.. ప్రభాస్ ఏదో రుగ్మతతో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది.

తీవ్రమైన కోపంతో ఎటువంటి ఆలోచన చేయకుండా.. ఓ మెంటల్ అండ్ సైకిక్ ఫెర్మారెన్స్ చూపిస్తున్నారు ట్రైలర్‌లో. ఓ ప్రాంతంపై ఆధిప్యత పోరుతో స్నేహితుడి కోసం సైనికుడిలా మారి.. వెనకా, ముందు,మంచి, చెడు అని పట్టించుకోకుండా ఊచకోత చేస్తున్నట్లు కనిపిస్తోంది దేవా క్యారెక్టర్. అన్ ప్రిడిక్టబుల్‌గా ఉందా క్యారెక్టర్ డిజైన్. బలవంతుడిగా చూపిస్తూనే.. తట్టుకోలేనంత కోపాన్ని దేవాలో చూపించాడు దర్శకుడు. దీన్ని బట్టి ఏదో డిజార్డర్‌తో ప్రభాస్ కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇక ఇదే నిజమైతే ఊర మాస్ జాతర ఖాయం. బాక్సాఫీస్ బద్దలు కావడం పక్కా. పూనకాలు రావడం గ్యారెంటీ. ఈ రెండు ట్రైలర్లను చూస్తే మీకు అలానే అనిపించినట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments