ఇండస్ట్రీలో విషాదం.. షాడో సినిమా డైరెక్టర్ రవిగౌడ్‌ మృతి

సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. యువ డైరెక్టర్ మృతి చెందారు. వినోద్‌ ప్రభాకర్‌తో షాడో సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ రవిగౌడ్ బ్రెయిన్‌ స్ట్రోక్‌తో తుది శ్వాస విడిచారు.

సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. యువ డైరెక్టర్ మృతి చెందారు. వినోద్‌ ప్రభాకర్‌తో షాడో సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ రవిగౌడ్ బ్రెయిన్‌ స్ట్రోక్‌తో తుది శ్వాస విడిచారు.

ఇటీవలికాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్లు ఫిట్ గా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తుంటారు. మంచి ఆహారాన్ని తీసుకుంటారు. అయినప్పటికీ ఆనారోగ్యాల భారిన పడుతున్నారు. కొందరు గుండెపోటుతో మరణిస్తున్నారు. మరికొందరు ఇతర అనారోగ్య కారణాలతో కన్నుమూస్తున్నారు. తాజాగా సినిమా ఇండస్ట్రీకి చెందిన మరో డైరెక్టర్ కన్నుమూశారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన డైరెక్టర్ రవిగౌడ్ బ్రెయిన్‌ స్ట్రోక్‌తో తుది శ్వాస విడిచారు. ఈయన కోలీవుడ్ లో కన్నడ హీరో కన్నడ ప్రభాకర్‌ కొడుకు వినోద్‌ ప్రభాకర్‌తో షాడో సినిమాను తీశాడు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్‌కు చెందిన చిదుగు రవిగౌడ్‌ పూరీ జగన్నాథ్‌ స్ఫూర్తితో అసోషియేట్‌ డైరెక్టర్‌గా ఎదిగాడు. ఆ తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా మారాడు. 2021లో వినోద్ ప్రభాకర్ తో షాడో సినిమాను తెరకెక్కించాడు. అయితే ఆ సమయంలో కరోనా మహమ్మారి విళయతాండవం చేసింది. ఈ కారణంగా షాడో సినిమా అనుకున్న స్థాయిలో మెప్పించలేక డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో రవిగౌడ్ అప్పుల్లో కూరుకుపోయాడు. మానసికంగా కృంగిపోయి అనారోగ్యంపాలయ్యాడు.

15 రోజుల క్రితం రవిగౌడ్ తీవ్ర అస్వస్థతకు గురికాగా వెంటనే కుటుంబ సభ్యలు అతడిని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బ్రెయిన్‌ స్ట్రోక్‌తో కన్నుమూశారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువ డైరెక్టర్ చిన్న వయసులోనే మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు డైరెక్టర్ రవిగౌడ్ మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. రవిగౌడ్ మృతితో బొప్పాపూర్‌ లో విషాదం అలుముకుంది.

Show comments