Swetha
Rajamouli Flop Sentiment Ended With Devara: మొత్తానికి దేవర బొమ్మ థియేటర్స్ లో పడింది. ప్రతిసారి ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు మామూలుగానే సందడి వాతావరణం ఉంటుంది. కానీ ఈసారి మాస్ జాతర విజువల్స్ కనిపిస్తున్నాయి. పైగా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్న టాక్ ను కూడా దేవర బ్రేక్ చేసింది.
Rajamouli Flop Sentiment Ended With Devara: మొత్తానికి దేవర బొమ్మ థియేటర్స్ లో పడింది. ప్రతిసారి ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు మామూలుగానే సందడి వాతావరణం ఉంటుంది. కానీ ఈసారి మాస్ జాతర విజువల్స్ కనిపిస్తున్నాయి. పైగా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్న టాక్ ను కూడా దేవర బ్రేక్ చేసింది.
Swetha
మొత్తానికి ఈరోజు రానే వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తారక్ అభిమానుల కోరిక నెరవేరింది. దేవర బొమ్మ థియేటర్స్ లో అదరగొడుతుంది. ఉదయం ఒంటి గంట నుంచే షోస్ స్టార్ట్ అవ్వగా… ఇప్పటికే మంచి టాక్ ను సంపాదించుకుంటుంది. దర్శకుడు చెప్పినట్లుగా ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా దేవర చూస్తే మాత్రం కచ్చితంగా ప్రేక్షకులు.. శాటిస్ఫై అవుతారు. ఏదేమైనా కొరటాల చెప్పింది చెప్పినట్లుగా నిరూపించి చూపించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 థియేటర్స్ లో ప్రీమియర్స్ తో విడుదలైంది దేవర. మాములుగా ఏదైనా మూవీ రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. ఇక ఇప్పుడు దేవర ఆగమనంతో థియేటర్స్ వద్ద మాస్ జాతర జరుగుతుంది. పైగా ఇవన్నీ కాకుండా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వినిపిస్తున్న ఓ టాక్ ను కూడా దేవర తుడిచిపెట్టేసింది. దర్శక ధీరుడు రాజమౌళి ప్లాప్ సెంటిమెంట్ కు బ్రేక్ చెప్పింది.
అదెంటో తెలియదు కానీ ఎప్పటినుంచో ఇండస్ట్రీ ఒక టాక్ ఉండిపోయింది. దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా తీసిన తర్వాత.. ఆ హీరో ఏ సినిమా తీసినా కానీ ప్లాప్ అవుతుంది అని. దానికి నిదర్శనాలు కూడా లేకపోలేదు. అలాగే ఆ సినిమాలు ఏంటో కూడా అందరికి తెలియనిది కాదు. దీనితో దేవర మూవీ రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ తర్వాత రావడంతో.. దేవరపై ఎంత హైప్ ఉంన్నా కానీ.. అభిమానులలో ఎక్కడో ఓ దగ్గర కాస్త భయం కూడా ఉండేది. అయితే దేవర బొమ్మ థియేటర్ లో పడిన వేనంటే ఆ భయాలన్నీ పటాపంచలయ్యాయి. తారక్ చెప్పినట్లుగానే దేవర అభిమానులను కాలర్ ఎగరేసుకునేలా చేస్తుంది. దీనితో రాజమౌళి ప్లాప్ సెంటిమెంట్ కు తెర పడింది. అసలు ఈ ప్లాప్ సెంటిమెంట్ మొదలైంది కూడా తారక్- రాజమౌళి కాంబోతోనే. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నెం.1 కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ సినిమా తర్వాత వచ్చిన నాగ మూవీ ప్లాప్ అవ్వడంతో.. ఇక ఆ తర్వాత కూడా ఇండస్ట్రీలో రాజమౌళి హిట్స్ తర్వాత వచ్చిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో… జక్కన్న ప్లాప్ సెంటిమెంట్ టాక్ నడుస్తూ వచ్చింది. కానీ ఒక్క దెబ్బతో దేవర ఈ టాక్ ను బ్రేక్ చేసింది.
ఇక దేవర సినిమా టాక్ విషయానికొస్తే.. తారక్ వన్ మ్యాన్ షో అనే టాక్ నడుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ప్రేక్షకులకు అలరించగా.. సెకండ్ ఆఫ్ కు కాస్త మిక్స్డ్ టాక్ వస్తుంది . ఇక ఇప్పట్లో థియేటర్ లో రిలీజ్ కు ఎలాంటి సినిమాలు లేవు కాబట్టి.. కచ్చితంగా ఈ మూవీ లాంగ్ రన్ లో దూసుకుపోవడం ఖాయం. మొత్తానికి ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ నుంచి ఎలాంటి మాస్ ఎలిమెంట్స్ ను ఆశించారో… అదే నట విశ్వరూపాన్ని తెరపై చూపించి మెప్పించారు తారక్. ఇక ఆచార్య లాంటి ప్లాప్ తర్వాత అనుకున్నట్లుగానే తారక్ దర్శకుడికి హిట్ ఇచ్చేశాడు. అలాంటి ప్లాప్ తర్వాత కొరటాల నుంచి ఇలాంటి కమ్ బ్యాక్ ను ఎవరు ఊహించి ఉండరు. ఇక దేవర దండయాత్ర మొదలైనట్లే.. కేవలం రికార్డ్స్ తిరగరాయడమే బ్యాలన్స్. మరి రాజమౌళి సెంటిమెంట్ ను దేవర బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.