నాగార్జున కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ.. మంత్రి కొండా సురేఖకు నోటీసులు?

Nagarjuna: నాాగార్జున కొండా సురేఖాపై వేసిన పరువు నష్టం దావా కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనున్నది. నేడు విచారణ నేపథ్యంలో సురేఖకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Nagarjuna: నాాగార్జున కొండా సురేఖాపై వేసిన పరువు నష్టం దావా కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనున్నది. నేడు విచారణ నేపథ్యంలో సురేఖకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సినీ నటుడు నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హీరో నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి చేసిన కామెంట్స్ సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. నాగ్ కుంటుంబంపై సురేఖ చేసిన వ్యాఖ్యలను టాలీవుడ్ ముక్త కంఠంతో ఖండించింది. సినీ సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు. నాగ చైతన్య, సమంత విడాకులపై సురేఖ చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో అలజడి సృష్టించాయి. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంది. సమంతకు క్షమాపణలు తెలిపింది. అయితే సురేఖ వ్యాఖ్యలతో నాగ్ ప్యామిలీ మానసిక వేదనకు గురైంది.

వారి స్వార్థ రాజకీయం కోసం తమ ఫ్యామిలీ ప్రతిష్టత దెబ్బతినేల వ్యాఖ్యలు చేయడంపై అక్కినేని కుటుంబం మండిపడింది. ఈ క్రమంలో నాగార్జున సురేఖపై లీగల్ యాక్షన్ కు దిగారు. ఆమెపై నాగ్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. నాగార్జున వేసిన పిటీషన్ పై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసు విచారణ నేపథ్యంలో తన వర్షన్ ను కోర్టుకు తెలిపేందుకు నేరుగా హాజరు కావాలని నాగ్ ను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో నటుడు నాగార్జున ఈ నెల 8న నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. మంత్రి తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యల వల్ల బాధకు గురయ్యామని, తమ ప్రతిష్టతకు భంగం కలిగిందని కోర్టుకు విన్నవించారు.

కుటుంబాన్ని కించపరిచేలా మంత్రి కామెంట్స్ చేశారని తెలిపారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనికోరారు. ఈ నేపథ్యంలో నాగ్ స్టేట్ మెంట్ ను కోర్టు రికార్డ్ చేసింది. ఈ కేసులో నడే కీలక పరిణామం చోటుచేసుకోనుంది. నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం పిటీషన్ పై నేడు విచారణ కొనసాగనుంది. ఇవాళ ఈ పిటిషన్ లో రెండో సాక్షి స్టేట్మెంట్ రికార్డు చేయనుంది కోర్టు. నాగార్జున స్టేట్ మెంట్ ను పరిగణనలోకి తీసుకుని కొండా సురేఖకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాగార్జున స్టేట్ మెంట్ ఆధారంగా నాంపల్లి కోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం. కేసు విచారణ నేపథ్యంలో ఉత్కంఠ పరిస్థితి నెలకొన్నది. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments