సమ్మర్ తర్వాతే అసలైన సినిమాల సందడి

గతంలో సమ్మర్ వస్తుందంటే సినిమాల రిలీజ్ కోసం ముందుగానే కర్చీఫ్ వేసుకునే వారు. ఎందుకంటే కచ్చితంగా ఫ్యామిలీస్ అంతా కలిసి థియేటర్స్ కు తరలివచ్చే పీక్ మూమెంట్ ఇది. కానీ ఈసారి సమ్మర్ మాత్రం అసలు అలా కనిపించడం లేదు.

గతంలో సమ్మర్ వస్తుందంటే సినిమాల రిలీజ్ కోసం ముందుగానే కర్చీఫ్ వేసుకునే వారు. ఎందుకంటే కచ్చితంగా ఫ్యామిలీస్ అంతా కలిసి థియేటర్స్ కు తరలివచ్చే పీక్ మూమెంట్ ఇది. కానీ ఈసారి సమ్మర్ మాత్రం అసలు అలా కనిపించడం లేదు.

గత రెండేళ్లుగా టాలీవుడ్ లో సమ్మర్ సందడి అసలు కనిపించడం లేదు. అప్పట్లో సమ్మర్ వస్తుందంటే దర్శక నిర్మాతలు ముందు నుంచే ప్రణాళిక వేసుకునేవారు. కానీ ఈ సమ్మర్ చూస్తే పూర్తిగా చప్పపడిపోయినట్టు అనిపిస్తుంది. ఈ నెల మొదట్లో హిట్ 3 , శుభం , సింగిల్ సినిమాలు సందడి చేసాయి. ఇక అవి తప్ప మధ్యలో ఎలాంటి రిలీజ్ లు లేవు. సమ్మర్ లాంటి పీక్ సీజన్ లో సరైన సినిమాలు పడకపోవడంతో బాక్స్ ఆఫీస్ కళ తప్పిందని చెప్పి తీరాల్సిందే. మరి ఈసారి దర్శక నిర్మాతలంతా సమ్మర్ తర్వాత సందడి చేద్దాం అని ఫిక్స్ అయ్యారో ఏమో కానీ.. ఈ సమ్మర్ హీట్ తగ్గిన తర్వాత మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి.

మే 30 న మనోజ్ , బెల్లంకొండ శ్రీనివాస్ , నారా రోహిత్ కలిసి నటించిన భైరవం మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక జూన్ మొదటి వారంలో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ మణిరత్నం , కమల్ హాసన్ థగ్ లైఫ్’ రాబోతోంది. రీసెంట్ గా ఈ రెండు సినిమాల ట్రైలర్స్ ప్రేక్షకులకు కాస్త ఇంట్రెస్టింగ్ గానే అనిపించడంతో.. ఈ రెండు సినిమాలపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక ఇది కాకుండా ప్రేక్షకులంతా ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘హరి హర వీరమల్లు మూవీ జూన్ 12 న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా చాలాసార్లు వాయిదా పడింది. కానీ ఈసారి మాత్రం రిలీజ్ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. ఇక ఇవన్నీ కంప్లీట్ అయ్యేలోపు సరిగ్గా జూన్ మూడో వారంలో నాగార్జున అఖిల్ ‘కుబేర’ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంటుంది.

ఇక ఆ తర్వాత మంచు విష్ణు పాన్ ఇండియా మూవీ కన్నప్ప విడుదల కానుంది. ఇలా సమ్మర్ అయ్యాక వరుస సినిమాలు బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేయనున్నాయి. ఇక వీటిలో ఏ సినిమాలు ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తాయో. ఏ సినిమాలు అంచనాలను అందుకుంటాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments