ఒకే మూవీతో ముగ్గురు హీరోల కంబ్యాక్..

రీసెంట్ మనోజ్ , నారా రోహిత్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటించిన భైరవం మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద కాస్త అంచనాలు ఏర్పడినట్టు అనిపిస్తుంది. అది కాకుండా ఈ సినిమాలో మరో స్పెషలిటి ఏంటంటే ఈ సినిమాతో ముగ్గురు హీరోలు కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు.

బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఈ ముగ్గురు ప్రధాన పాత్రలలో నటిస్తున్న మూవీ భైరవం. ఈ సినిమా మే 30 న విడుదల కానుంది. దింతో మూవీ టీం ప్రమోషన్స్ మీద ఫోకస్ చేశారు. ఈ ప్రాసెస్ లో రీసెంట్ గా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ను గమనించినట్లైతే ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే ఓ విలేజ్ బ్యాక్డ్రాప్ కథ ఇది. ముగ్గురు వ్యక్తులు , మూడు స్వభావాలు , వారి మధ్య స్నేహాలు , పగలు , ప్రతీకారాలు , పట్టింపులు ఇలా అన్నిటికి జస్టిఫికేషన్ చేస్తూ చూపించే కథలా అనిపించింది. ఇలా మొత్తానికి ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గానే వుంది.

అయితే గత కొంతకాలంగా ఈ ముగ్గురు హీరోల నుంచి సరైన కథలు రాలేదు. దీనితో ఒక్కసారిగా ట్రైలర్ లో ముగ్గురు తమ విశ్వరూపం చూపించడంతో.. మంచి రెస్పాన్స్ లభిస్తుంది. సో ఈ ముగ్గురు హీరోలకు ఈ సినిమా కంబ్యాక్ ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ ట్రైలర్ లో చూపించినట్టు కథ అంతా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే డెఫినిట్ గా ఈ హీరోలు సక్సెస్ ట్రాక్ లోకి వచ్చే అవకాశం లేకపోలేదు. పైగా ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా కలిపి చూపించారు కాబట్టి.. అటు అన్ని వర్గాల ఆడియన్స్ ను ఈ సినిమా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. సో ఇక మూవీ రిలీజ్ అయితే కానీ ఈ విషయాలపై ఓ క్లారిటీ వచ్చేలా లేదు . ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments