కోల్‌కతా వైద్యురాలి ఘటనపై నిరసన తెలిపితే.. నన్ను బెదిరిస్తున్నారు:నటి మిమీ చక్రవర్తి

Actress Mimi Chakraborty: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై రేప్, మర్డర్ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సుమోటాగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై సీబీఐ కూడా లోతుగా దర్యాప్తు చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ ఘటనపై న్యాయం కోసం పోరాడుతున్నారు.

Actress Mimi Chakraborty: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై రేప్, మర్డర్ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సుమోటాగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై సీబీఐ కూడా లోతుగా దర్యాప్తు చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ ఘటనపై న్యాయం కోసం పోరాడుతున్నారు.

దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఒంటరిగా మహిళలు బయటకు వెళ్లాంటే భయపడే కాలం వచ్చింది.  చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. నిత్యం ఎక్కడో అక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఓ వైపు ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేబడుతున్నా.. అవేవీ పట్టనట్టుగా మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా.. ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కోల్‌కొతాలో ఓ ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై పెద్ద ఎత్తున నిరసనల సెగలు చెలరేగాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు సెలబ్రెటీలు గళం విప్పారు. వివరాల్లోకి వెళితే..

కోల్‌కొతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి తర్వాత దారుణంగా హత్య చేసిన ఘటన యావత్ భారత దేశం ఉలిక్కి పడేలా చేసింది. వందల మంది ప్రాణాలు కాపాడే వైద్యురాలికే రక్షణ లేకుండా పోయిందని మహిళాలోకం దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ దారుణానికి పాల్పపడిన నిందితులకు వెంటనే ఉరిశిక్ష విధించాలని పెద్ద ఎత్తున ర్యాలీలు చేపబడుతున్నారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా మద్దతు పలికారు. ఈ క్రమంలోనే ఆగస్టు 14 రాత్రి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ, నటి మిమీ చక్రవర్తి పాల్గొన్నారు. ఆమెతో పాటు రిద్ది సేన్, అరిందమ్ సిల్, మధుమితా సర్కార్ వంటి నటీమణులు పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే కోల్‌కొతా రేప్ అండ్ మర్డర్ కేసుకు తాను మద్దతు పలికినందుకు తనను రేప్ చేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, సోషల్ మీడియాలో అసభ్యంగా మేసేజ్‌లు పెడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ, సినీ నటి మిమీ చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసి ‘మేం మహిళలకు న్యాయం చేయమని అడుగుతున్నాం..ఇది మంచిది కాదా? కొంతమంది గుంపులో గోవిందగాళ్లు మహిళలకు అండగా నిలబడితే అత్యాచార బెదిరింపులు చేస్తున్నారు. సరైన పెంపకం పెరిగిన వారు, చదువుకున్న వారు దీన్ని సమర్థిస్తారా?’ అంటూ ఈ పోస్ట్ కోల్‌కొతా సైబర్ పోలీసులకు సెల్ విభాగానికి ట్యాగ్ చేసింది.2008 నుంచి సీరియల్స్ లో నటించి, 2012 లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పలు హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. 2014 – 2024 మద్య మమతా బెనర్జీ తృణముల్ కాంగ్రెస్ తరుపున ఎంపీగా పనిచేసింది.

Show comments