iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటికి చేదు అనుభవం.. స్క్రీన్‌ షాట్లతో సహా పెట్టేసింది!

ప్రముఖ నటికి చేదు అనుభవం.. స్క్రీన్‌ షాట్లతో సహా పెట్టేసింది!

ప్రముఖ కోలీవుడ్ నటి ఆత్మికకు చేదు అనుభవం ఎదురైంది. టెక్నాలజీ మిస్టేక్స్‌ కారణంగా ఆమె తన డబ్బులు పోగొట్టుకున్నారు. ట్విటర్‌ వేదికగా ఈ సంఘటన గురించిన విషయాలను ఆమె తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఆత్మిక యాపిల్‌ ఫోన్‌ వాడుతున్నారు. ఈ ఫోన్‌లో కొన్ని యాపిల్‌ సర్వీసులకు సంబంధించి ఆమె ఆటో పే ఆప్షన్‌ను ఆఫ్‌ చేశారు. అయినప్పటికీ ఆమె ఖాతాలోంచి దాదాపు 5 వేల రూపాయలు కట్‌ అయ్యాయి. ఇలా ఒక్కసారిగా ఐదు వేల రూపాయలు కట్‌ అ‍వ్వటంతో ఆమె షాక్‌ తిన్నారు.

వెంటనే దాన్ని స్క్రీన్‌ షాట్‌ తీశారు. తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘‘ఫోన్‌లో ఆటో-పే ఆప్షన్‌ను ఆపేసినా.. డబ్బులు కట్ అయ్యాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? దీన్ని ఎలా ఆపాలి?’’ అంటూ సహాయం కోసం ఫ్యాన్స్‌ను అర్థించారు. నటి పెట్టిన పోస్టును చూసి ఆమె అభిమానులు స్పందించారు . బ్యాంకు వాళ్లతో జరిగిన విషయం గురించి మాట్లాడి డబ్బులు వెన్నక్కి తెచ్చుకోవచ్చని సలహా ఇస్తున్నారు. అలాగే యాపిల్ కస్టమర్ సపోర్ట్ వాళ్ళతో కూడా మాట్లాడమని చెబుతున్నారు.

కాగా, ఆత్మిక ” మీసయ మురుక్కు” సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఆమె ఐదు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న “నరగాసురన్” షూటింగ్‌ జరుపుకుంటోంది. కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్‌ మరికొన్ని రోజులు ఆలస్యం అవుతోంది. అతి త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరి, ఆత్మిక యాపిల్‌ కారణంగా ఐదు వేల రూపాయలు పోగొట్టుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.