Swetha
జీవితంలో .. సరదాలు... ఆనందాలువేరు .. వ్యక్తిత్వం కాపాడు కోవటం.. గౌరవ మర్యాదలు పొందటం వేరు అని మన ఆనందాల కోసం .. కుటుంబ ప్రతిష్టను .. తలితండ్రుల నమ్మకాన్ని ఫణంగా పెట్టకూడదు అనే విషయాన్ని తెలుసుకున్నాను.. అనంతరం అదే పాటించాను కూడా అన్నారు కృష్ణంరాజు తన జీవితం గురించి ఓ సందర్భంలో..
జీవితంలో .. సరదాలు... ఆనందాలువేరు .. వ్యక్తిత్వం కాపాడు కోవటం.. గౌరవ మర్యాదలు పొందటం వేరు అని మన ఆనందాల కోసం .. కుటుంబ ప్రతిష్టను .. తలితండ్రుల నమ్మకాన్ని ఫణంగా పెట్టకూడదు అనే విషయాన్ని తెలుసుకున్నాను.. అనంతరం అదే పాటించాను కూడా అన్నారు కృష్ణంరాజు తన జీవితం గురించి ఓ సందర్భంలో..
Swetha
నేను బికాం థర్డ్ ఇయర్ కు చేరుకునే సమయానికి ఓక్సాలిన్ అనే కారు కొన్నాను. ఆ కారులో నేను కాలేజీకి వెళుతుంటే నన్ను చూసి కొందరు ఎవరో కుర్ర లెక్చరర్ అనుకునే వారు. నేను నా క్లాస్ వరకే పరిమితం తప్ప ఇతరత్రా ఏ గొడవల్లో తల దూర్చేవాడిని కాదు. ఎప్పుడు వస్తానో ఎప్పుడు వెళ్తానో .. తెలియక పోవడంతో చాలా మందికి నేను స్టూడెంట్ నో లెక్చరర్ నో కూడా తెలిసేది కాదు. నేను స్టూడెంట్ అనే విషయం కాలేజీ మొత్తానికి ఎప్పుడు తెలిసింది అంటే .. ఒక సారి కాలేజీ లో ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్ లో సమరసింహారెడ్డి స్టూడెంట్ యూనియన్ లీడర్ గా నిలబడ్డాడు. ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాడు. కొందరు స్టూడెంట్స్ అప్పుడే కారు దిగి వస్తున్న నన్ను చూపించి ..ఈయన్ను ఓటు అడుగుదాము పదండీ అన్నారు. ఆయన లెక్చరర్ కదా అన్నారు సదరు సమరసింహారెడ్డి .. ఆయన లెక్చరర్ కాదు స్టూడెంటే అని చెప్పడంతో ఆయన ఆశ్చర్య పోయి నా దగ్గరకు వచ్చి ఎలక్షన్స్ లో నా తరుపున ప్రచారం చేయండి అడిగారు … నేను అలాగే చేశాను ఆయన గెలిచారు కూడా .. ఆ ప్రచార సమయంల నేను స్టూడెంట్ అన్న విషయం మా కాలేజీ మొత్తానికి తెలిసింది.
అలా ఒక వైపు స్టూడెంట్ గా మరో వైపు పార్ట్ టైం జర్నలిస్టుగా చాలా జాలీగా …సరదాగా నా కాలేజీ జీవితం గడిచింది. నా జాలీ లైఫ్ చూసి ఈర్షపడ్డ ఎవరో ప్రెండ్ మా నాన్నకు ఒక ఆకాశ రామన్న ఉత్తరం రాశారు. అందులో సారాంశం ఏమిటంటే … మీ అబ్బాయి చదువు సంధ్య మానేసి జల్సాగా తిరుగుతున్నాడు. అతన్ని కంట్రోల్ లో పెట్టుకోండి అని …నిజానికి అలాంటి ఉత్తరం చదివిన ఏ తండ్రిఅయినా హుటా హుటిన బయలు దేరి వచ్చి ఉత్తరం మొహాన కొట్టి దీనికి నీ సంజాయిషీ ఏమిటి? అని నిలదీస్తాడు. కానీ అందుకు భిన్నంగా మా నాన్న గారి దగ్గరి నుండి నాకు ఒక ఉత్తరం వచ్చింది. అందులో నా ఆకాశరామన్న ఉత్తరం కూడా ఉంది. నీ గురించి ఎవరో నాకీ ఉత్తరం రాశారు .. కానీ నువ్వు నా కొడుకువి. .. నువవు ఏ తప్పు చేయవన్న నమ్మకం నాకుంది. ఇప్పుడే కాదు .. ఇకముందు కూడా తండ్రిగా నీకు కావలసినవి సమకూర్చడం తప్ప నీ జీవితంలో నేను ఎలాంటి జోక్యం చేసుకోను.. కానీ ఇలా ఈర్షపడే ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండు. ఇదీ మానాన్న గారి ఉత్తరంలో సారాంశం.
ఆ ఉత్తరం చుదువుతుంటే నా కళ్ళ నుండి బొటా బొటా కన్నీళ్ళు కారాయి. వయసు వచ్చిన కొడుకు వ్యక్తిత్వాన్ని గౌరవించాలి .. అని చాలా మంది తలితండ్రులు చెపుతారు. కానీ మానాన్న గారు దాన్ని అనుసరించి చూపించారు. పిల్లలను ఆయిదేళ్ళ వయసు వరకు దేవుళ్ళ లాగా ట్రీట్ చేయాలి. అయిదు నుండి 18 ఏండ్ల వయసు వరకు సేవకుడిగా .. సంరక్షకుడిగా వ్యవహరించాలి. ఆపైన వాళ్ళను స్నేహితుడిగా ట్రీట్ చేయాలి. అనే ఆదర్శాన్ని మా నాన్న ఆచరించిన మానాన్న సహృదయతకు మనసులోనే హ్యాట్సాఫ్ చెప్పుకున్నాను. చిన్న వయసులో ఇంటికి వచ్చిన అతిథిని సరిగ్గా పలకరించనందుకు హంటర్ తెగేలా కొట్టిన మా నాన్న …నాకంటే ఒక వయసు వ్యక్తిత్వం వచ్చిన తరువాత ఇంత గొప్పగా ట్రీట్ చేయడం నాకు చాలా గొప్ప అనుభూతిని కలగ జేసింది. అప్పడే రియలైజ్ అయ్యాను. జీవితంలో .. సరదాలు… ఆనందాలువేరు .. వ్యక్తిత్వం కాపాడు కోవటం.. గౌరవ మర్యాదలు పొందటం వేరు అని మన ఆనందాల కోసం .. కుటుంబ ప్రతిష్టను .. తలితండ్రుల నమ్మకాన్ని ఫణంగా పెట్టకూడదు అనే విషయాన్ని తెలుసుకున్నాను.. అనంతరం అదే పాటించాను కూడా అన్నారు కృష్ణంరాజు తన జీవితం గురించి ఓ సందర్భంలో..