Devara Movie: దేవర సినిమాను చూడటానికి 10 కారణాలు ఇవే!

Devara Movie: మరికొన్ని గంటల్లో దేవర సినిమా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా దేవర మూవీని కచ్చితంగా చూడటానికి పది కారణాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

Devara Movie: మరికొన్ని గంటల్లో దేవర సినిమా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా దేవర మూవీని కచ్చితంగా చూడటానికి పది కారణాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల ఎంతో ఉత్కంఠగా ఉన్నారు. కారణం మరికొన్ని గంటల్లో దేవర సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అంతేకాక దేవర విడుదలకు ముందే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో దేవరకు సంబంధించి అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి. అలానే దేవర మూవీని కచ్చితంగా చూడటానికి పది కారణాలు ఇవే అంటూ కూడా నెట్టింట్లో వైరల్ గా మారాయి. దేవరను చూడటానికి పది కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

కారణం: 1

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబర్ స్టార్ గా మారారు. అంతేకాక ఆరేళ్ల తరువాత దేవరతో తారక్ సోలో హీరోగా థియేటర్ లోకి ఇస్తున్నాడు. అంతేకాక దేవరను 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో  తెరకెక్కించడంతో ఫ్యాన్స్ కు  ఈ సినిమా ప్రత్యేకమని చెప్పవచ్చు.

కారణం: 2

ఇక దేవర సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు..మేకర్స్. దాదాపుగా 40 నిమిషాల పాటు అండర్ వాటర్ సీక్వెన్స్ లతో ఈ సినిమాను తెరెక్కించారు. ఇందులో సొరచేపతో ఫైట్ సీక్వెన్స్ హైలెట్ గా ఉండనుంది.  గ్రాఫిక్స్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను దేవర మెప్పించడం పక్కా అని చెప్పవచ్చు. దేవరను చూడటానికి ఇది మరోక కారణం.

కారణం: 3

ఇక మూడో కారణం వచ్చేసి..స్టార్ హీరోలు మాస్ సినిమాలకు దూరమవుతున్న తరుణంలో యాక్షన్ ప్రియులకు విందు భోజనంలా దేవర తెరకెక్కింది. తెలుగు నేటివిటీకి, ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇచ్చిన దేవర సినిమాలో పాటలు అద్భుతంగా ఉన్నాయి. అలానే బీజీఎం సినిమాకు హైలెట్ గా నిలవనుంది. దేవరలో తారక్ ఫుల్ మాస్ గా కనిపించి..అభిమానులకు, సినీ ప్రియులకు కిక్కెంచనున్నాడు.

కారణం: 4

దేవర సినిమాలో అనేక ట్విస్టులు ఉన్నాయి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ తరహాలో ఈ సినిమాలోని ట్విస్టులు విజయంలో కీలక పాత్ర పోషించనున్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తోన్నాయి.

కారణం: 5

కొరటాల శివ ఆచార్య సినిమాతో నిరాశపరిచినా సంగతి తెలిసింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ఆడలేకపోయింది. ఇక ఆచార్య ప్లాఫ్ తరువాత అద్భుతమైన మెసేజ్ తో దేవర సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో  కొరటాలకు పూర్వ వైభవం వస్తుందని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆచార్య తరువాత వస్తున్న సినిమా కాబట్టి దీనిపై ఓ రేంజ్ లో  ఆసక్తి నెలకొంది.

కారణం: 6

దేవర, వర పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ వచ్చేలా ఉండనున్నాయనే టాక్ వినిపిస్తోంది. వీటి కోసమైన దేవర చూడాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా గతంలోనూ నటించారు. దేవర సినిమాతో ఎన్టీఆర్ ముచ్చటగా మూడోసారి తండ్రీకొడులుగా నటించడం గమన్హారం.

కారణం: 7

ఇక  దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి శృతి మరాఠే, జాన్వీ కపూర్ పరిచయం కానున్నారు. వీళ్లిద్దరికెరీర్ కు ఈ సినిమా కీలకం కానుందని చెప్పొచ్చు. జాన్వీ గ్లామర్, శృతి నటన కోసం దేవర సినిమాను చూడవచ్చు. ఈ సినిమాతో వారిద్దరు టాలీవుడ్ లో ఏ స్థాయిలో నిలదొక్కుంటారో చూడాలి.

కారణం: 8

దేవర సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసింది. అంతేకాక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం రికార్డు స్థాయిలో స్క్రీన్లలో దేవర విడుదల కానుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు దేవర సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది. ఈ హైప్ కోసమైన దేవర సినిమాను చూడాలని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తోన్నాయి.

కారణం: 9

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ కోసం ఈ సినిమాను ఎన్నిసార్లైనా చూడవచ్చని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తారక్ నటన గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎలాంటి క్యారెక్టర్ ను అయినా సునాయసంగా చేయగలగడం తారక్ సొంతం. ఇప్పటికే అనేక విభిన్నమైన పాత్రల్లో నటించి..గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఈ సినిమాలో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించనున్నాడు. దేవర సినిమాను చూడటానికి ఇదో కారణం.

కారణం: 10

విడుదలకు ముందే దేవర పలు రికార్డులను క్రియేట్ చేసింది. అంతేకాక కొన్ని ఆల్ టైమ్ రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇంతలా హైప్ క్రియేట్ చేసిన దేవరలో ఏముంది అనేది సినీప్రియులో ఉన్న సందేహం. ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఇచ్చిన హైప్ కూడా ఈ సినిమా చూడటానికి ఒక కారణమనే అభిప్రాయులు వినిపిస్తోన్నాయి. మొత్తంపై దేవర సినిమాను చూడటానికి పది కారణాలు ఇవే అంటూ పై అంశాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments