SBI: సొంతూరిలోనే SBI ఉద్యోగం! జీతం 17000.. అప్లై చేసుకోండిలా!

మీరు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా?. అయితే మీలాంటి వారికి ఓ శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మీరు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా?. అయితే మీలాంటి వారికి ఓ శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రతి ఒక్కరు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరికి ప్రభుత్వ రంగ సంస్థలో చేయడం, మరికొందరికి బ్యాంకింగ్ సెక్టార్ లో జాబ్స్ చేయండం అంటే ఇష్టం. ఇలా ఉద్యోగాల కోసం ఎంతో మంది యువత కష్టపడుతుంటారు. అహర్నిశలు కష్టపడి చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఆశావాహులకు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మీరు కేవలం ఏదైనా డిగ్రీ పాసైతే చాలు ఈ ఉద్యోగాలకు పోటీపడవచ్చు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

కేంద్ర  ప్రభుత్వ బ్యాంకుల్లో అతి పెద్ద వాటిల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఒకటి. దేశంలోనే ఎక్కువ మంది వినియోగదారులు కలిగిన బ్యాంకుల్లో ఇది ఒకటి. ఎన్నో రకాల సేవలు అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. అలానే మరిన్ని సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది ఇలా ఉంటే.. తరచూ ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగాల భర్తికీ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. అలానే తాజాగా నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ అందించింది.

ఎస్బీఐ బ్యాంక్ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం యూత్ ఫర్  ఇండియా ఫెలోషిప్  పోస్టులను భర్తీ చేయనున్నారు.  ఇక ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లయ్ చేయాలి అనుకునే వారి వయస్సు 21 నుంచి 32 మధ్య మాత్రమే ఉండాలి. కనిష్టంగా 21 నుంచి గరిష్టంగా 32 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వాళ్లు ఈ పోస్టులకు అర్హులు. అదే విధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ లకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఇక విద్యార్హత విషయానికి వస్తే.. ఈ  ఉద్యోగాలకగు అప్లయ్ చేయాలంటే.. ప్రభుత్వం చేత గుర్తింపు  పొందిన ఏదైనా  సంస్థ నుంతి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉంటే సరిపోతుంది. ఏదైనా డిగ్రీని కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఇక ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.17 వేలు జీతంగా చెల్లించడం జరుగుతుంది. మే 31వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగానికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎస్బీఐ రాత పరీక్ష నిర్వహించి మెరిటీ ఆధారంగా తుది జాబితాను తయారు చేస్తుంది. ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కార్యక్రమం ఆరోగ్యం, గ్రామీణ జీవనోపాధి, ఆహార భద్రత, పర్యావరణ పరిరక్షణ, విద్య, నీరు, సాంకేతికత, మహిళా సాధికారత, స్వయం-పరిపాలన, సామాజిక వ్యవస్థాపకత, సాంప్రదాయ క్రాఫ్ట్ మరియు ప్రత్యామ్నాయ శక్తి వంటి 12 రంగాల విషయంలో పనిచేస్తుంది. ఫెలోషిప్ ప్రోగ్రామ్ సమయంలో, ఫెలోస్ విడుదలలో వివరించిన విధంగా వారి ఆసక్తికి అనుగుణంగా ఈ 12 నేపథ్య రంగాలలో ఒకదానిలో విధులు నిర్విహిస్తారు. మరి… ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేయవచ్చు. పూర్తి వివరాల కోసం.. సంబంధిత అధికారిక https://youthforindia.org/register  వెబ్ సైట్ లోకి చూడండి.

Show comments