డిగ్రీతోనే TCSలో సాఫ్ట్‌వేర్‌ జాబ్ కొట్టే ఛాన్స్.. ఫ్యూచర్ కు తిరుగుండదు

TCS BPS Hiring 2025: మీరు జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ ఐటీ కంపెనీలో డిగ్రీ అర్హతతోనే సాఫ్ట్ వేర్ జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఇప్పుడే అప్లై చేసుకోండి.

TCS BPS Hiring 2025: మీరు జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ ఐటీ కంపెనీలో డిగ్రీ అర్హతతోనే సాఫ్ట్ వేర్ జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఇప్పుడే అప్లై చేసుకోండి.

సాఫ్ట్ వేర్ జాబ్ అంటే యూత్ కు డ్రీమ్ జాబ్ అని చెప్పొచ్చు. లక్షల్లో జీతాలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో వర్క్, వీకెండ్ హాలిడేస్ లాంటి సౌకర్యాలు ఉండడంతో వరల్డ్ వైడ్ గా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు క్రేజ్ ఎక్కువ. మీరు సాఫ్ట్ వేర్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. డిగ్రీతోనే సాఫ్ట్ వేర్ జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో సాఫ్ట్ వేర్ గా స్థిరపడిపోవచ్చు. టీసీఎస్ లో జాబ్ కోసం ఎంతో మంది ట్రై చేస్తుంటారు. ఇందులో జాబ్ కొడితే మీ ఫ్యూచర్ కు తిరుగుండదు. గ్రాడ్యుయేట్స్ కోసం టీసీఎస్ బీపీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ను నిర్వహిస్తోంది.

మీరు డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే ఈ అవకాశాన్ని వదలకండి. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బీపీఎస్‌ ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ ద్వారా.. ఆర్ట్స్, కామర్స్ అండ్‌ సైన్స్ గ్రాడ్యుయేషన్‌ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. అభ్యర్థుల వయసు 18-28 ఏళ్లు మధ్య ఉండాలి. తాజాగా టీసీఎస్‌ బీపీఎస్‌ ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ 2025 ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల వారు సెప్టెంబర్‌ 11 వరకు ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు మంచి కమ్యునికేషన్‌ స్కిల్స్‌, అనలైటికల్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ స్కిల్స్‌, బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌, మ్యాథమెటిక్స్‌ అండ్‌ లాజికల్‌ పై అవగహన కలిగి ఉండాలి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • పోస్టులు : అసోసియేట్‌ పోస్టులు

అర్హత:

  • అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కాలేజీ నుంచి బీకాం, బీఏ, బీఏఎఫ్, బీబీఐ, బీబీఏ, బీబీఎం, బీఎంఎస్, బీఎస్సీ (గణితం, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినహా) డిగ్రీ ఫుల్‌టైమ్‌ గ్రాడ్యుయేట్లు – 2025 ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యేనాటికి కేవలం ఒక బ్యాక్‌లాగ్‌ మాత్రమే ఉండే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు:

  • అభ్యర్థుల వయసు 18-28 ఏళ్లు మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

  • పరీక్షలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తులకు చివరి తేది:

  • 11-09-2024
Show comments