ఈ Bank జాబ్స్ కు ఇంకా అప్లై చేయలేదా? డిగ్రీ ఉంటే చాలు.. నెలకు లక్షన్నర జీతం

Bank of Maharashtra Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిగ్రీ ఉంటే చాలు నెలకు లక్షన్నర జీతంతో జాబ్ సొంతం చేసుకోవచ్చు.

Bank of Maharashtra Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిగ్రీ ఉంటే చాలు నెలకు లక్షన్నర జీతంతో జాబ్ సొంతం చేసుకోవచ్చు.

బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూసే ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్. ప్రముఖ బ్యాంక్ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే పోస్టులను అనుసరించి నెలకు లక్షన్నర వరకు జీతం పొందొచ్చు. డిగ్రీ పాసైన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్. బ్యాంక్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమైతే వెంటనే అప్లై చేసుకోండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆఫీసర్ స్కేల్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 195 జాబ్స్ ను భర్తీ చేయనున్నారు.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆఫీసర్ భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ఛీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, బిజినెస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయి. అభ్యర్థులు డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. గరిష్టంగా 50 ఏళ్లు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 195

పోస్టుల వివరాలు:

  • డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ఛీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, బిజినెస్ డెవలప్ మెంట్ ఆఫీసర్.

విభాగాలు:

  • ఇంటిగ్రేటెడ్ రిస్క్ మేనేజ్ మెంట్
  • ఫారెక్స్ అండ్ ట్రెజరీ
  • ఐటీ/డిజిటల్ బ్యాంకింగ్/ సీఐఎస్ఓ/ సీడీఓ
  • క్రెడిట్, ఎకనామిస్ట్ తదితర విభాగాలు

అర్హత:

  • అభ్యర్థులు డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • గరిష్టంగా 50 ఏళ్లు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • నెలకు స్కేల్-2 పోస్టులకు రూ.64,820-రూ.93,960, స్కేల్-3కు రూ.85,920 – రూ.1,05,280, స్కేల్-4కు రూ.1,02,300-రూ.1,20,940, స్కేల్-5కు రూ.1,20,940-రూ.1,35,020, స్కేల్-6 పోస్టులకు రూ.1,40,500-రూ.1,56,500.

దరఖాస్తు ఫీజు:

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 118గా నిర్ణయించారు. ఇతరులకు రూ. 1180 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్ లైన్ లో అప్లికేషన్లను జనరల్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, హెచ్.ఆర్.ఎం డిపార్ట్ మెంట్, హెడ్ ఆఫీస్, లోక్ మంగల్, శివాజీనగర్, పుణె చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి.

దరఖాస్తులు ప్రారంభం:

  • 11-07-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 26-07-2024
Show comments