స్పోర్ట్స్ బాగా ఆడుతారా? ఈ Bank ఉద్యోగాలు మీకోసమే.. మిస్ చేసుకోకండి!

మీరు స్పోర్ట్స్ బాగా ఆడుతారా? అయితే ఈ బ్యాంక్ ఉద్యోగాలు మీకోసమే. తాజాగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్పోర్ట్స్ కోటా కింద కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

మీరు స్పోర్ట్స్ బాగా ఆడుతారా? అయితే ఈ బ్యాంక్ ఉద్యోగాలు మీకోసమే. తాజాగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్పోర్ట్స్ కోటా కింద కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

క్రీడా రంగంలో అత్యత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రభుత్వాలు ఉద్యోగాలను కల్పిస్తుంటాయి. ప్రభుత్వ శాఖల్లోని పలు పోస్టులలో నియమిస్తుంటాయి. అంతేగాక స్పోర్ట్స్ కోటా కింద రైల్వేలో, బ్యాంక్, ఇతర ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తుంటాయి. మరి మీరు కూడా గేమ్స్ బాగా ఆడుతారా. క్రీడల్లో మంచి నైపుణ్యం ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్. స్పోర్స్ట్ కోటా కింద బ్యాంకులో జాబ్ పొందే అవకాశం వచ్చింది. తాజాగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్పోర్ట్స్ కోటా కింద కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నది. అయితే ఈ పోస్టులకు కేవలం మహిళలకు మాత్రమే అర్హులు. వాలీబాల్ క్రీడలో నైపుణ్యం కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి పాసై ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 64 వేల జీతం అందుకోవచ్చు. అభ్యర్థులు 18-25 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 8వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు: 12

అర్హత:

  • అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి టెన్త్ పాసై ఉండాలి. అలాగే, క్రియాశీల క్రీడా దశ ముగిసిన 5 సంవత్సరాలలోపు గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హతను పొంది ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల కనీస వయస్సు పరిమితి 18 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • ప్రొఫిషియెన్సీ టెస్టు, ఫీల్డ్ ట్రయల్స్ ద్వారా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.64440 వేతనంగా చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్/ఈడబ్య్లూఎస్/ఓబీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 590 చెల్లించాలి. ఎస్టీ/ఎస్సీ వర్గానికి చెందిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 118 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు ఫారమ్‌ను పూరించి, జనరల్ మేనేజర్, హెచ్‌ఆర్‌ఎం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, హెచ్‌ఆర్‌ఎం డిపార్ట్‌మెంట్, హెడ్ ఆఫీస్, లోక్‌మంగల్, 1501, శివాజీనగర్, పూణే 411005కు పోస్ట్ ద్వారా పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 08-07-2024
Show comments